Categories: General News

కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే బైక్..!!

ప్రస్తుత కాలంలో రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రూపాయి, రెండు రూపాయలకు ఏం రావట్లేదు. చిన్న పిల్లలు సైతం రూపాయి, రెండు రూపాయలు తీసుకోమంటే మారాం చేస్తున్నారు. అయితే ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ మాత్రం ఏకంగా కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

రూపాయికే బైక్ ఇస్తామని సదరు కంపెనీ చేసిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లకు ఈ ఆఫర్ ప్రకటించింది.  బైక్ కొనాలనే ఆశ ఉన్న కస్టమర్లకు ఈ వార్త నిజంగా శుభవార్త అనే చెప్పాలి. అయితే ఈ ఆఫర్ ను పొందాలంటే అంత సులభమేమీ కాదు. బ్యాంక్ షరతులకు అంగీకరించిన కస్టమర్లు మాత్రమే ఈ ఆఫర్ ను పొందే అవకాశం ఉంటుంది. దేశంలోని అన్ని ఫెడరల్ బ్యాంక్ బ్రాంచ్ ల నుంచి ఈ ఆఫర్ ను పొందవచ్చు. ఈ ఆఫర్ ను పొందాలనుకునే వినియోగదారులు ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డ్ నుంచి బ్యాంక్ బ్రాంచ్ లలో ఒక రూపాయి చెల్లించాల్సి ఉంటుంది.  

టీవీఎస్ మోటార్స్ షోరూం, హోండా మోటార్ సైకిల్, హీరో మోటో కార్ఫ్ ల నుంచి బ్రహ్మాండమైన ఈ ఆఫర్ ను పొందవచ్చని సమాచారం. ఫెడరల్ బ్యాంక్ రూపాయి చెల్లించి బైక్ ను సొంతం చేసుకున్న వినియోగదారులు మిగిలిన మొత్తాన్ని ఈఎంఐల రూపంలో చెల్లించాలని చెబుతున్నాయి. ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ఈ ఆఫర్ కు అర్హులో కాదో తెలుసుకోవాలంటే dc emi అని టైప్ చేసి 5676762 నంబర్ కు మెసేజ్ చేయాల్సి ఉంటుంది.  

500 సీసీ ఇంజన్ సామర్థ్యాన్ని బట్టి వడ్డీరేటులో తేడా ఉంటుందని బ్యాంక్ తెలిపింది. ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లకు మరో ఆఫర్ కూడా ప్రకటించింది. హోండా షోరూంలో ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డును ఉపయోగించి బైక్ కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తామని బ్యాంక్ తెలిపింది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago