ప్రస్తుత కాలంలో రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రూపాయి, రెండు రూపాయలకు ఏం రావట్లేదు. చిన్న పిల్లలు సైతం రూపాయి, రెండు రూపాయలు తీసుకోమంటే మారాం చేస్తున్నారు. అయితే ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ మాత్రం ఏకంగా కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

రూపాయికే బైక్ ఇస్తామని సదరు కంపెనీ చేసిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లకు ఈ ఆఫర్ ప్రకటించింది. బైక్ కొనాలనే ఆశ ఉన్న కస్టమర్లకు ఈ వార్త నిజంగా శుభవార్త అనే చెప్పాలి. అయితే ఈ ఆఫర్ ను పొందాలంటే అంత సులభమేమీ కాదు. బ్యాంక్ షరతులకు అంగీకరించిన కస్టమర్లు మాత్రమే ఈ ఆఫర్ ను పొందే అవకాశం ఉంటుంది. దేశంలోని అన్ని ఫెడరల్ బ్యాంక్ బ్రాంచ్ ల నుంచి ఈ ఆఫర్ ను పొందవచ్చు. ఈ ఆఫర్ ను పొందాలనుకునే వినియోగదారులు ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డ్ నుంచి బ్యాంక్ బ్రాంచ్ లలో ఒక రూపాయి చెల్లించాల్సి ఉంటుంది.
టీవీఎస్ మోటార్స్ షోరూం, హోండా మోటార్ సైకిల్, హీరో మోటో కార్ఫ్ ల నుంచి బ్రహ్మాండమైన ఈ ఆఫర్ ను పొందవచ్చని సమాచారం. ఫెడరల్ బ్యాంక్ రూపాయి చెల్లించి బైక్ ను సొంతం చేసుకున్న వినియోగదారులు మిగిలిన మొత్తాన్ని ఈఎంఐల రూపంలో చెల్లించాలని చెబుతున్నాయి. ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ఈ ఆఫర్ కు అర్హులో కాదో తెలుసుకోవాలంటే dc emi అని టైప్ చేసి 5676762 నంబర్ కు మెసేజ్ చేయాల్సి ఉంటుంది.
500 సీసీ ఇంజన్ సామర్థ్యాన్ని బట్టి వడ్డీరేటులో తేడా ఉంటుందని బ్యాంక్ తెలిపింది. ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లకు మరో ఆఫర్ కూడా ప్రకటించింది. హోండా షోరూంలో ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డును ఉపయోగించి బైక్ కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తామని బ్యాంక్ తెలిపింది.



























