Viral News: న్యూటన్ నియమాన్ని మార్చేసిన బుడ్డోడు..కరోనాకు న్యూటన్ నియమానికి లింక్ పెడుతూ..!
Viral News: చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి.. ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా విస్తరించింది. చిన్నా పెద్ద, ధనిక – బీద అనే తేడాలు లేకుండా అందర్ని లెక్కలు తేలుస్తోంది. కరోనా మొదట్లో వ్యాక్సిన్లు లేక లక్షల మంది ప్రజలు పిట్టల్లా రాలారు.
ఇప్పటికే ప్రపంచంలో 30 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 50 లక్షలకు పైగా జనాలు మరణించారు. ప్రస్తుతం వ్యాక్సిన్ వచ్చినా… కరోనా తన రూపాన్ని మార్చుకుని ఓమిక్రాన్ రూపంలో మళ్లీ ప్రజలపై విరుచుకు పడుతోంది. ఇదిలా ఉంటే కరోనాపై మీమ్స్, సెటైర్లకు కొదవ లేదు. కరోనే కేంద్రంగా ఎన్నో స్కిట్లు, హాస్య చిత్రాలు రావడం మనం చూస్తూనే ఉన్నాం.
తాజాగా ఓ విద్యార్థి.. ఫిజిక్స్ లోని న్యూటన్ నాలుగో నియమాన్ని ఏకంగా కరోనాకే అప్లై చేశాడు. కరోనా పరిశోధన, కరోనా వ్యాప్తి ఒకదానికొకటి అనులోమాను పాతంలో ఉంటాయని తేల్చాడు. అంటే కరోనా పెరుగుతుంటే, పరిశోధనల క్రమం నెమ్మదిస్తోంది. అదే పరిశోధనలు వేగవంతం అవుతుంటే కరోనా తగ్గుముఖం పడుతోంది. దీనిని ఓ సమీకరణాన్నే రూపొందించాడు. పైగా ‘కే’ అనే స్థిరాంకాన్ని ‘‘ వినాశనం’’ ను సూచిస్తుందని చెప్పాడు.
ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతుందనుకుంటున్న సమయంలో కరోనా.. ఓమిక్రాన్ వేరియంట్ రూపంలో మళ్లీ పడగ విప్పుతోంది. దీంతో మరోసారి జనాలు ఇళ్లకే పరిమితం అవుతున్న పరిస్థితి ఏర్పడింది. జనాలు మళ్లీ ఆంక్షల ఛట్రంలోకి వెళుతున్నారు. స్కూళ్లు మూపడుతున్నాయి. మాల్స్, థియేటర్లు మూతపడుతున్నాయి. ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేసుకోవాల్సి వస్తోంది. దీంతో ప్రస్ట్రేషన్ కు గురైన సదరు విద్యార్థి కరోనాకు ఏకంగా… సమీకరణాన్నే రూపొందించాడు. అంతేకాదు ఈ విషయానికి “కోవిడ్ కాల్ కా న్యూటన్ (న్యూటన్ ఆఫ్ కోవిడ్ టైమ్స్)” అనే క్యాప్షన్ జోడించి మరీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇది ట్విట్లర్ లో వైరల్ గా మారుతోంది. నవ్వులు పూయిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…