ప్రస్తుతం ఏదైనా సినిమాలోని డైలాగ్స్, పాటలు హిట్ అయ్యాయంటే… అంతే నెట్టింట్లో వీటికి స్ఫూప్ లు కవర్స్ తెగ వచ్చేస్తున్నాయి. వీటిని అభిమానులు తెగ వైరల్ చేసేస్తున్నారు. చూడటానికి కూడా బాగుండటంతో మిలియన్ సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. ఇటీవల కాలంలో హిట్ అయిన బుల్లెట్ బండి పాటకు మేల్ వెర్షన్ రాశారు ఇలాగే.. అది కూడా చాలా మంది నెటిజన్లను ఆకర్షించింది.
తాజాగా ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా ’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుసు. ఫ్యాన్స్ ఎంతో అంచానాలు పెట్టుకున్న ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. అయితే విడులకు ముందే సమంత ఐటెం సాంగ్ జనాలను పిచ్చేక్కించేసింది. సమంత అందాలు, బన్నీ డ్యాన్స్, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్, ఇంద్రావతి చౌహన్ హస్కీ వాయిస్ కలిసి సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది.
తాజాగా ప్రమోషన్ వేడుకల్లో కూడా ఈసాంగ్ ఉంటాది.. అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేయడం చూస్తుంటే.. థియేటర్లో సాంగ్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో పెట్టిన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈపాటపై పురుషుల సంఘాలు, భార్య బాధితుల సంఘాలు ఫిర్యాదులు కూడా చేశారు.
వివాదాలు ఎలా ఉన్నా.. తాజాగా ఈ పాటకు మేల్ వెర్షన్ తయారు చేశారు. ‘మీ కళ్లల్లోనే వంకర ఉంది.. ఆడాళ్ల బుద్ధే వంకర బుద్ధి.. ఊ అంటావా పాప.. ఊఊ అంటావా పాప’ అంటూ సాగుతోన్న ఈ సాంగ్ వైరల్ అవుతోంది. ఈ మేల్ వెర్షన్ సాంగ్ సంబంధించిన వీడియోను ఓ యూజర్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈపాటకు అనుగుణంగా పలు సినిమాల వీడియోలను పెట్టడంతో అందరిని ఆకట్టుకుంటోంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…