Featured

నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నా ఆగుతున్నా.. సిరి లేకపోతే షన్నూ ఎప్పుడో పిచ్చోడు అయ్యేవాడు.! : సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్..

బిగ్ బాస్ తెలుగు హౌజ్ లో సిరి, షణ్ముఖ్ ప్రయాణం.. అందరి కంటే డిఫిరెంట్ అనే చెప్పాలి. ఇక ఫినాలేకు కేవలం రెండు రోజుల మాత్రమే మిగిలి ఉంది. కానీ బయట మాత్రం ఉండడంతో ఆ వేడి రోజురోజుకూ పెరిగిపోతోంది. సిరికి అప్పటికే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్యామిలీతో ఇంటరాక్ట్ సమయంలో శ్రీహాన్ స్టేజ్ పైకి వచ్చి.. సిరిపై నమ్మకం ఉందని.. షణ్ముఖ్ తన ఫ్రెండ్ అంటూ చెప్పి.. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు అంటూ చెప్పి వెళ్లిపోయాడు.

ఆ సమయంలో శ్రీహాన్ ను చాలామంది ప్రశంసించారు. ఇదిలా ఉండగా.. సిరి టాప్ 5లోకి వెళ్లిన తర్వాత సీన్ అంతా రివర్స్ అయిపోతోంది. సిరి వల్ల షణ్ముఖ్ నెగెటివ్ అవుతున్నాడని.. హగ్ ఇవ్వొద్దని చెప్పినా ఆమె దగ్గరకు వెల్లి హగ్గులు ఇవ్వడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే దీనిపై సిరిది, షణ్ముఖ్ ది కూడా తప్పు ఉందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు ఎంతో కామ్ గా ఉన్న శ్రీహాన్ ఈ వ్వహారాలపై తనదైన శైలిలో స్పందించాడు. సోషల్ మీడియాలో ఓ భారీ పోస్టును షేర్ చేశాడు. అందులో ఏ రాశాడంటే.. ‘‘ఒక క్యారెక్టర్ ను బ్లేమ్ చేస్తూ పోస్టులు పెట్టడంలోనే తెలుస్తుంది వీళ్ల మెచ్యూరిటీ. 10 రోజుల క్రితమే తన దగ్గరకు ఓ స్క్రీన్ షాట్ వచ్చింది. నన్ను ఎంతోమంది ఏవేవో అంటున్నా ఏ రోజూ నేను పోస్ట్‌ చేయలేదు. ఎందుకంటే వాటివల్ల పేరెంట్స్‌ బ్లేమ్‌ అవ్వకూడదని ఆలోచించాను. కానీ ఈ రోజు ఎవరి ద్వారానో ఒక స్క్రీన్‌షాట్‌ బయటకు వస్తే పాపం సిరి ఏం చేసిందని, ఒక అమ్మాయని కూడా చూడకుండా క్యారెక్టర్‌ బ్లేమ్‌ అయ్యేలా పోస్టులు పెడుతున్నారు. మీ అమ్మ గురించి నేను ఆగిపోయాను.

ఎంత సేపటికీ సిరి వల్ల నెగెటివ్ అయ్యాడు అయ్యాడు అంటారేంటి ఎవరి గేమ్ ఏంటో తెలిసి కూడా… నెగెటివ్‌ అవ్వడం కాదు, ఒకవేళ సిరి తోడుగా లేకపోతే వేరే సపోర్ట్‌ లేక అతడు పిచ్చోడయ్యేవాడు. ఎందుకంటే వేరే ఎవ్వరితో కలవడు కాబట్టి.. ఇక్కడ సిరి వేరేవాళ్లతో మాట్లాడినా తప్పే, డ్యాన్స్‌ వేసినా తప్పే, నవ్వినా తప్పే, నేనే నీకు ప్రపంచం అని క్రియేట్‌ చేస్తే తను మాత్రం ఏం చేస్తుంది.. ఇంకా ఎవరి దగ్గరకని వెళ్తుంది.. ఫ్రెండ్‌ బాధపడకూడదని ఆలోచించి ఆగుతుంటే అడ్జస్ట్‌ అవుతుంటే వీళ్లు ఇచ్చే విలువ ఇదా..?..

బిగ్‌బాస్‌ చివరి రోజుల్లో ఎందుకు ఈ నెగెటివిటీలు అని నా దగ్గర ప్రూఫ్స్‌ ఉన్నా ఆగుతుంటే అనవసరంగా సిరి అనడం ఏంటి బ్రదర్’’.. అంటూ నెటిజన్లపై మండిపడ్డాడు. అయితే అతడు పోస్టు చేసిన కొన్ని నిమిషాలకే డిలీట్ చేసేశాడు. మొత్తానికి శ్రీహాన ఇటు ట్రోలర్స్ కి.. ఇటు షణ్ముఖ్ కు గట్టిగానే ఇచ్చాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago