బిగ్ బాస్ తెలుగు హౌజ్ లో సిరి, షణ్ముఖ్ ప్రయాణం.. అందరి కంటే డిఫిరెంట్ అనే చెప్పాలి. ఇక ఫినాలేకు కేవలం రెండు రోజుల మాత్రమే మిగిలి ఉంది. కానీ బయట మాత్రం ఉండడంతో ఆ వేడి రోజురోజుకూ పెరిగిపోతోంది. సిరికి అప్పటికే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్యామిలీతో ఇంటరాక్ట్ సమయంలో శ్రీహాన్ స్టేజ్ పైకి వచ్చి.. సిరిపై నమ్మకం ఉందని.. షణ్ముఖ్ తన ఫ్రెండ్ అంటూ చెప్పి.. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు అంటూ చెప్పి వెళ్లిపోయాడు.

ఆ సమయంలో శ్రీహాన్ ను చాలామంది ప్రశంసించారు. ఇదిలా ఉండగా.. సిరి టాప్ 5లోకి వెళ్లిన తర్వాత సీన్ అంతా రివర్స్ అయిపోతోంది. సిరి వల్ల షణ్ముఖ్ నెగెటివ్ అవుతున్నాడని.. హగ్ ఇవ్వొద్దని చెప్పినా ఆమె దగ్గరకు వెల్లి హగ్గులు ఇవ్వడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే దీనిపై సిరిది, షణ్ముఖ్ ది కూడా తప్పు ఉందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు ఎంతో కామ్ గా ఉన్న శ్రీహాన్ ఈ వ్వహారాలపై తనదైన శైలిలో స్పందించాడు. సోషల్ మీడియాలో ఓ భారీ పోస్టును షేర్ చేశాడు. అందులో ఏ రాశాడంటే.. ‘‘ఒక క్యారెక్టర్ ను బ్లేమ్ చేస్తూ పోస్టులు పెట్టడంలోనే తెలుస్తుంది వీళ్ల మెచ్యూరిటీ. 10 రోజుల క్రితమే తన దగ్గరకు ఓ స్క్రీన్ షాట్ వచ్చింది. నన్ను ఎంతోమంది ఏవేవో అంటున్నా ఏ రోజూ నేను పోస్ట్ చేయలేదు. ఎందుకంటే వాటివల్ల పేరెంట్స్ బ్లేమ్ అవ్వకూడదని ఆలోచించాను. కానీ ఈ రోజు ఎవరి ద్వారానో ఒక స్క్రీన్‌షాట్ బయటకు వస్తే పాపం సిరి ఏం చేసిందని, ఒక అమ్మాయని కూడా చూడకుండా క్యారెక్టర్ బ్లేమ్ అయ్యేలా పోస్టులు పెడుతున్నారు. మీ అమ్మ గురించి నేను ఆగిపోయాను.
ఎంత సేపటికీ సిరి వల్ల నెగెటివ్ అయ్యాడు అయ్యాడు అంటారేంటి ఎవరి గేమ్ ఏంటో తెలిసి కూడా… నెగెటివ్ అవ్వడం కాదు, ఒకవేళ సిరి తోడుగా లేకపోతే వేరే సపోర్ట్ లేక అతడు పిచ్చోడయ్యేవాడు. ఎందుకంటే వేరే ఎవ్వరితో కలవడు కాబట్టి.. ఇక్కడ సిరి వేరేవాళ్లతో మాట్లాడినా తప్పే, డ్యాన్స్ వేసినా తప్పే, నవ్వినా తప్పే, నేనే నీకు ప్రపంచం అని క్రియేట్ చేస్తే తను మాత్రం ఏం చేస్తుంది.. ఇంకా ఎవరి దగ్గరకని వెళ్తుంది.. ఫ్రెండ్ బాధపడకూడదని ఆలోచించి ఆగుతుంటే అడ్జస్ట్ అవుతుంటే వీళ్లు ఇచ్చే విలువ ఇదా..?..
Finally #Shrihan said it..
— Suneetha (@suneethak7) December 15, 2021
But Y only after coming to Top 5 ??
Did he wait for it and saying now???
He could have done long before…..
Now everything he says seems like he waited for siri to reach top5 and saying it ????????♀️#BiggBossTelugu5 #Siri#TitleHunterVJSunny #Sunny pic.twitter.com/oA2jVCu02T
బిగ్‌బాస్ చివరి రోజుల్లో ఎందుకు ఈ నెగెటివిటీలు అని నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నా ఆగుతుంటే అనవసరంగా సిరి అనడం ఏంటి బ్రదర్’’.. అంటూ నెటిజన్లపై మండిపడ్డాడు. అయితే అతడు పోస్టు చేసిన కొన్ని నిమిషాలకే డిలీట్ చేసేశాడు. మొత్తానికి శ్రీహాన ఇటు ట్రోలర్స్ కి.. ఇటు షణ్ముఖ్ కు గట్టిగానే ఇచ్చాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.































