Featured

P.R. Varalakshmi : రాధిక గారి అప్పులకు కారణం అదే… ఇల్లు అమ్మేసి అడ్వాన్స్ తీసుకున్న తరువాత ఏం జరిగిందంటే… కొడుకు ఏం చేస్తున్నాడు…: సీనియర్ నటి పిఆర్ వరలక్ష్మి

P.R. Varalakshmi : అలనాటి నటుల్లో వరలక్ష్మి అని పేరు పెట్టుకున్న అందరూ నటీమనుల్లో అందరూ సక్సెస్ అయినవారే. నగరికి చెందిన పిఆర్ వరలక్ష్మి గారు తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ, మలయాళం ఇలా పలు భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వందల సినిమాల్లో నటించిన వరలక్ష్మి గారు కృష్ణావతారం సినిమా ద్వారా తెలుగులో పరిచయమయ్యారు. తమిళంలో సీరియల్స్ లో నటిస్తున్న వరలక్ష్మి గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు అలానే తన కుటుంబం గురించిన విశేషాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు వరలక్ష్మి.

రాధిక జీవితాన్ని ఎదురీదింది…

వరలక్ష్మి గారు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెర మీద అడుగుపెట్టారు. ఎన్నో సీరియల్స్ లో నటించిన ఆమె ఎక్కువగా హీరోయిన్ రాధిక గారి నిర్మాణ సంస్థ రాడాన్ టీవీలో పనిచేసారు. వరలక్ష్మి గారు ఇది కథ కాదు, అమ్మాయి కాపురం వంటి ఎన్నో సీరియల్స్ లో నటించారు. ఇక రాధిక గారి గురించి మాట్లాడుతూ సినిమాల్లో తల్లి పాత్రలకు అడగడం మొదలు పెట్టడంతో రాధిక కు విసుగు వచ్చి ఇక ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలని, అప్పటికే అప్పుల్లో ఉండటం వల్ల ఉన్న ఇంటిని అమ్మేయాలని అడ్వాన్స్ కూడా తీసుకున్న సమయంలో ఒక స్నేహాతుడు రాధికకు నువ్బు ఇండస్ట్రీ వదిలి వెళ్ళలేవు, ఈ ఇంటిని వదల లేవు మళ్ళీ నువ్వు ఇండస్ట్రీలో నిలబడతావు చూడు అని చెప్పారట.

అలానే మళ్ళీ నిర్ణయం మార్చుకుని రాధిక ఇంటికి తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసి ఇల్లు అమ్మకుండా రాడాన్ టీవీ ద్వారా సీరియల్స్ మొదలు పెట్టారు. అలా అందులో సక్సెస్ అయ్యాక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమెతో మంచి అనుబంధం ఉంది అంటూ ఆమె తన కొడుకును ప్రస్తుతం ఏదో స్పెషల్ కోర్స్ లో చదివిస్తోంది అంటూ ఆమెతో ఉన్న అనుబంధాన్ని వరలక్ష్మి వివరించారు.

Bhargavi

Recent Posts

పెళ్లిలో మూడు ముళ్లు ఎందుకు వేస్తారు? అసలు రహస్యం ఇదే!

హిందూ వివాహ సంప్రదాయం అనేది కాలానుగుణంగా మారుతూ వచ్చినా, దాని అంతర్భాగమైన ఆచారాలకు మాత్రం ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది.…

7 minutes ago

గంగమ్మ రాత్రివేళ గోదావరిలో స్నానం చేస్తుందా? ఆసక్తికర విశ్వాసం!

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన వెలసిన కుండలేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యత కలిగిన…

19 minutes ago

తులసి ఆకులు రంగు మారితే ఏమిటి సంకేతం? శుభమా? అశుభమా?

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. చాలా ఇళ్లలో తులసిని దైవ స్వరూపంగా భావిస్తూ నిత్య…

38 minutes ago

నవగ్రహాల ప్రదక్షిణ ఎలా చేయాలి? చాలామందికి తెలియని నియమాలు!

హిందూ సంప్రదాయంలో నవగ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. మన జీవితంలోని అనేక పరిణామాలు గ్రహాల ప్రభావంతోనే జరుగుతాయని విశ్వాసం. అందుకే…

44 minutes ago

వేసవిలో తప్పక తినాల్సిన పండు ఇదే… రోజ్‌ ఆపిల్‌ ప్రయోజనాలు తెలుసా?

వేసవి తీవ్రత పెరిగే కొద్దీ శరీరాన్ని చల్లబరచే ఆహారాలపై ప్రజలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అలాంటి సీజన్‌ ఫ్రూట్స్‌లో రోజ్‌…

57 minutes ago

90% మందికి తెలియని పండ్లు తినే సరైన టైమ్ ఇదే!

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ వాటిని ఎప్పుడు తింటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో…

1 hour ago