Categories: FeaturedMovie News

Camera Man P. Devaraj : యాక్సిడెంట్ జరిగి నడవలేని స్థితిలో కెమెరామాన్… తినడానికి తిండి లేక… చనిపోవాలని అనుకున్నాను…: కెమెరా మాన్ దేవరాజ్

Camera Man P. Devaraj : ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర హీరోల సినిమాలకు కెమరామాన్ గా పనిచేసి, అలానే చిరంజీవి, బాలకృష్ణ గారి సినిమాలకు పనిచేసి, అలాగే పలు భాషలు తమిళం, కన్నడ, మలయాళం హిందీ ఇలా అన్ని భాషలలో పనిచేసిన సినిమాటోగ్రాఫర్ పి.దేవరాజ్ గారు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో చాలా దీన స్థితిలో ఉన్నారు. ఆయన సోదరులిద్దరూ కెమెరామాన్ లుగా పనిచేశారు. మూడు వందలకు పైగా సినిమాలకు పనిచేసిన దేవరాజ్ గారు ప్రస్తుతం అనారోగ్య కారణాలతో అలానే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు.

తినడానికి తిండి లేక చనిపోదామని అనుకున్నా…

దేవరాజ్ గారిని ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ యాంకర్ కలిసినపుడు ఆయన పడుతున్న ఇబ్బందులను గురించి దేవరాజ్ గారు తెలిపారు. ఒకప్పుడు ఎన్నో సినిమాలకు పనిచేసిన తనకు ఇప్పుడు ఇలా దీన స్థితిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ బాధపడ్డారు. ఇండస్ట్రీకి ఎంతో మందిని పరిచయం చేసానని జయప్రద, ప్రభ వంటివారిని ఇండస్ట్రీలో రికమెండ్ చేసానని కానీ ప్రస్తుతం ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదంటూ చెప్పారు. దేవరాజ్ గారి తమ్ముడు సాయి కూడా కెమెరామాన్ అంతేకాకుండా సాయి భార్య అలనాటి ఐటమ్ సాంగ్ హీరోయిన్ జ్యోతిలక్ష్మి. ఇక దేవరాజ్ గారు కుటుంబాన్ని నిలబెట్టి అందరినీ సెటిల్ చేసినా చివరకు ఆయన అనారోగ్యంతో ఉన్నపుడు ఎవరూ చూడటం లేదంటూ చెప్పారు.

కొడుకుకు ఏదో ఒక దారి చూపిస్తే ఆ తరువాత చనిపోయినా పర్వాలేదాంటూ మాట్లాడారు. ఏ తప్పు చేయకపోయినా ఇలాంటి పరిస్థితిలో ఉన్నానంటూ, ఒకసారి తెలుగు సినిమా షూటింగ్ అపుడు కర్నూల్ దాటాక జగన్ మోహన్ రెడ్డి అనుచరులు తాగి రిజిస్ట్రేషన్ కాని బండితో తానువెళ్తున్న కారును ఢీ కొట్టడంతో కాళ్ళకు దెబ్బ తగిలి అప్పటి నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రతి నేలా కొంత డబ్బు రజనీకాంత్ గారు పంపుతారని అయితే మందులకు ఇంటి ఖర్చులకు సరిపోక ఇబ్బందులు పడుతున్నా వేరొకరిని అడగండం ఇష్టం లేదంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago