Singer Parvathi : తెలుగులో టీవీ ఛానెల్స్ లో వస్తున్న సింగింగ్ షోలలో జీ తెలుగులో ప్రసారమయ్యే సరిగమప సింగింగ్ షో ఒకటి. ఇక ఈ ప్రోగ్రామ్ లో సింగర్ గా పార్వతి అనే అమ్మాయి సంచలనమే సృష్టించింది. మనిషి అందంతో కన్నా ప్రతిభతోనే ఎక్కువ గుర్తించబడతాడని నిరూపించింది. తన గాత్రంతో అందరి మనసు దోచుకుంటున్న పార్వతి, మొదటి సారి షోలో పాట పాడి తన గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించింది. తెలుగు రాష్ట్రాలలో చాలా మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది పార్వతి.
మరోసారి బుల్లితెర మీద పార్వతి…
జీ తెలుగులో ప్రసారమయ్యే సరిగమప సింగర్స్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన పార్వతి ఆ షో అయిపోయాక మళ్ళీ అడపాదడపా టీవీ షోస్ లో కనిపించినా ఇపుడు మళ్ళీ సింగర్ గా పాటలు పాడి అలరించడానికి రెడీ అవుతోంది. ‘సరిగామప’ కొత్త షో స్టార్ట్ అవబోతోంది, ఈ సారి ఒక టీం కాకుండా నాలుగు టీంలుగా పోటీపడబోతున్నాయి. ఇక ఆల్రెడీ సింగర్స్ గా సరిగమప ద్వారా తెలిసిన సింగర్స్ తో పాటు కొత్తవాళ్ళు ఇందులో పాల్గొంటున్నారు.
అలా నాలుగు టీంలతో పోటీ పడుతూ గెలుపు కోసం పోరాడనున్నారు సింగర్స్. ఇందులో మరోసారి కంటెస్టెంట్ గా పార్వతి రానుంది. ఇక సింగర్ పార్వతి మరోసారి పాల్గొనడం గురించి మాట్లాడుతూ నాలుగు టీంలతో కలిసి పోటీ పడటం బాగుందని, ఈసారి కంపిటిషన్ మరింత టఫ్ గా ఉండబోతోందంటూ అభిప్రాయపడింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…