Senior Producer Chittibabu : బాలకృష్ణ టంగ్ స్లిప్ అయి అక్కినేని అలానే రంగారావు గారిని తప్పుగా సంభోదిస్తూ మాట్లాడటం వల్ల చిక్కుల్లో పడ్డారు. అక్కినేని అభిమానుల నుండి విమర్శలు అలానే సోషల్ మీడియా ట్రోల్స్ మొదలయినా ఇప్పటికీ ఆయన ఈ ఇష్యూ మీద స్పందించలేదు. అయితే మరో వైపు అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున సైలెంట్ గా ఉన్నా నాగచైతన్య, అఖిల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయితే ఈ ఇష్యూని పెద్దగా చూడొద్దు అంటూ నిర్మాత చిట్టిబాబు గారు మాట్లాడారు.
బాలకృష్ణ ఆ ఉద్దేశంతో అనలేదు…
నిర్మాత చిట్టిబాబు మాట్లాడుతూ బాలకృష్ణ కు అక్కినేని నాగేశ్వరావు గారితో మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఆయనతో చాలా గౌరవంగా నడుచుకునే వాడంటూ కేవలం ఏదో ఫ్లోలో మాట్లాడుతూ అలా అన్నదే తప్ప నిజంగా అక్కినేని అంటే గౌరవం లేక కాదు. ఇక అయినా అక్కడ నాగేశ్వరావు గారి పేరు ఎత్తలేదు బాలకృష్ణ కేవలం అక్కినేని అని మాత్రమే సంభోదించారు.
అదో ఇంటిపేరు మాత్రమే నాగేశ్వరావు ను అన్నట్లు కాదు కదా.. అనవసరంగా నాగేశ్వరావు గారి వారసులు అఖిల్ నాగ చైతన్య స్పందించారు. నాగార్జున కు బాలకృష్ణ కు నాగేశ్వరావు గారితో ఉన్న అనుబంధం తెలుసు, అందుకే సైలెంట్ గా ఉన్నాడు. ఈ విషయంను అనవసరంగా బాలకృష్ణ అంటే గిట్టని వాళ్ళు ఎక్కువ చేసి చూపుతున్నారు అంతే. బాలకృష్ణ కూడా నాతో మాట్లాడినపుడు ‘నేను మాట్లాడిన దాన్ని వక్రీకరించి ఏదో చెబుతున్నారు’ అంటూ చెప్పాడు అని చిట్టిబాబు గారు అభిప్రాయపడ్డారు.
హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…