Samantha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి సమంత ఒకరు. ఈమె మనకు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన ఏం మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సమంత అనంతరం వెనక్కి తిరిగి చూసుకోలేదు.
తెలుగు తమిళ భాషలలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన సమంత తన వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులను కూడా ఎదుర్కొంది.అయితే ఇప్పుడిప్పుడే వాటి నుంచి కోలుకొని తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టిన సమయంలో మరోసారి మయోసైటిసిస్ వ్యాధి తనని వెంటాడుతోంది. ఇక ఈ వ్యాధితో బాధపడుతున్న సమంత తన సినిమాలకు కాస్త విరామం ఇచ్చి పూర్తిగా చికిత్స తీసుకుంటున్నారు.
ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి ఈమె కోలుకుంటున్న తరుణంలో మెల్లిగా తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు.గత కొద్ది రోజుల క్రితం యశోద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఈమె నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం శాకుంతలం ఫిబ్రవరి 17వ తేదీ విడుదల కానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
ఇక సమంత ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అమ్మాయి అయితే తన పాకెట్ మనీ కోసం ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు మోడలింగ్ రంగంలోకి వెళ్లారు. అలాగే పలు కంపెనీలకు ప్రమోటర్గా కూడా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఈమె సినిమాలలోకి రాకముందు ఆషిక అనే గోల్డ్ కంపెనీకి సంబంధించిన యాడ్ లో నటించారు. ప్రస్తుతం ఈ యాడ్ కిసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో సమంత ఎంతో చలాకీగా ఎంతో అల్లరి అల్లరి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…