P.R Varalakshmi : సింగర్ వసంత కుమారి, కమెడియన్ కృష్ణమూర్తి ల కుమార్తె అయిన అలనాటి నటి శ్రీ విద్య మళయాలి అయినా కూడా పుట్టి పెరిగింది తమిళనాడు చెన్నై. మొదటి నుండి సినిమా ఇండస్ట్రీకి చెందిన కుటుంబం కావడం, తండ్రి అనారోగ్యంతో మరణించడం వల్ల శ్రీ విద్య బాలనటిగా సినిమాల్లో అడుగుపెట్టారు ఆ పై హీరోయిన్ గా అటు మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు అలా దక్షిణాది నాలుగు భాషలలోనూ నటించారు. అయితే శ్రీ విద్య టాలెంట్, అందం రెండూ ఉండి కూడా కెరీర్ లో ఎదగలేక పోయారు. ఇక వ్యక్తిగతంగా కూడా ప్రేమ పేరుతో కొంతమంది మోసం చేయడం వల్ల క్రుంగిపోయారు. ఇక యాభైమూడేళ్ల వయసులో ఆమె క్యాన్సర్ తో మరణించారు. ఆమె గురించి సీనియర్ నటి వరలక్ష్మి గారు మాట్లాడారు.
శ్రీ విద్యను ఆయనే మోసం చేసాడు…
శ్రీవిద్య ఒక డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా అతను మోసం చేయడం వల్ల ఆస్తులన్నీ కోల్పోయిందంటూ వరలక్ష్మి గారు అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ ఆ డైరెక్టర్ ఇండస్ట్రీలో ఉన్నాడని ఇల్లు ఆమెదే అయినా ఇంటి స్థలం అతనిది కావడం, ఇలాంటి వాటి వల్ల ఉన్న ఆస్తులను శ్రీవిద్య కోల్పోయిందంటూ చెప్పారు. శ్రీవిద్య కు పెద్దగా కుటుంబం లేదని భర్త మోసం చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొందని తెలిపారు.
క్యాన్సర్ వచ్చి బాధపడుతున్న రోజుల్లో కూడా తనని ఎవరినీ చూడటానికి రానిచ్చేది కాదు, ఎవరోతో మాట్లాడేది కాదు, కేవలం కమల్ హాసన్ మాత్రమే ఒకసారి వెళ్లి వచ్చాడు అంతే అంటూ శ్రీవిద్య గారి గురించి వరలక్ష్మి గారు తెలిపారు. ఆమె మరణించినపుడు చాలా బాధపడ్డానని, ఆరోజంతా ఏడుస్తూనే ఉనాన్ను అంటూ తెలిపారు. సినిమాలను చేస్తున్న సమయంలో శ్రీవిద్య గారు ఇచ్చిన సలహాలు ఇప్పటికీ పాటిస్తున్నాను. ఇండస్ట్రీలో కళ్ళతో మాట్లాడగలిగే వారు కేవలం సావిత్రమ్మ, శ్రీవిద్యనే అంటూ తెలిపారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…