Teegala Krishna Reddy : ప్రతిపక్షాలు చంద్రబాబును విమర్శించాలంటే వెన్నుపోటు అనే అంశాన్ని తెరమీదకు తెస్తారు. మామకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నావ్ అంటూ మాట్లాడుతారు. అయితే అందులో నిజానిజాలు అప్పటి నాయకులకు తప్ప నేటి తరానికి ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఎన్టీఆర్ పార్టీని లక్ష్మి పార్వతి చేతిలో పెడుతున్న సమయంలో చంద్రబాబు టీడీపీ పార్టీని కాపాడాడు అంటూ మరో వెర్షన్ మనకు వినిపిస్తుంది. అయితే అసలు ఏం జరిగింది అనే విషయాల మీద అప్పటి తెలుగుదేశం నేత తీగల కృష్ణా రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు.
లక్ష్మి పార్వతి చేతిలో కీలుబొమ్మగా ఎన్టీఆర్…
వైశ్రాయ్ హోటల్ లో ఎన్టీఆర్ మీద చెప్పులతో జరిగిన దాడి, పార్టీని ఏ పరిస్థితులలో చంద్రబాబు నాయుడు పార్టీని తీసుకోవాల్సి వచ్చిందో తీగల కృష్ణా రెడ్డి వివరించారు. ఎన్టీఆర్ గారు లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకోవడం ఆయన చేసిన పెద్ద తప్పు అంటూ చెప్పారు. ఆమె ఒక అభిమానిగా ఆయన దగ్గరకు తన భర్త, తన కొడుకుతో వచ్చి చివరకు ఆయననే పెళ్లి చేసుకుంది. ఇక ఆపైన పార్టీ మీద పెత్తనం చేయాలని చూసింది లక్ష్మి పార్వతి. ఆమె రోశయ్య, నాదెండ్ల భాస్కరరావు తదితర వారితో ఆల్రెడీ మంతనాలు జరుపుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలలందరూ చంద్రబాబును పార్టీ గురించి ఎన్టీఆర్ తో మాట్లాడండి లేదంటే అశోక్ గజపతి రాజును లీడర్ గా ఎన్నుకొంటాం అనడంతో చంద్రబాబు ఆయనను కలిసాడు. అప్పుడు నేను ఆయన వెంట ఉన్నాను. అప్పటికే ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి ట్రాప్ లో పూర్తిగా ఉన్నారు. ఆమెను సీఎం చేయాలని భావిస్తున్నట్లు అర్థమైపోయింది, ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరు.
నేను ఉండగానే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ తో పార్టీ గురించి ఎమ్మెల్యేల గురించి ఆలోచించండి అంటే పరుష పదజాలంతో బూతులు తిట్టారు ఎన్టీఆర్. ఇక ఆయన వినే పరిస్థితిలో లేడని అర్థమై అక్కడి నుండి వచ్చేసాం. ఆ తరువాత ఎమ్మెల్యేలలందరూ కలిసి చంద్రబాబును లీడర్ గా ఎన్నుకోవడం అన్నీ జరిగిపోయాయి. ఆ నాడు చంద్రబాబు లేకపోతే టీడీపీ ఎపుడో కాంగ్రెస్ చేతిలోకి వెళ్లిపోయేది అంటూ తెలిపారు. ఒకవేళ చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ఉంటే ఇంతకాలం ఎందుకు అందరు ఎమ్మెల్యేలు ఆయనతో ఉన్నారు, ప్రజలు అపుడు వెంటనే జరిగిన ఎన్నికల్లో గెలిపించారు అంటూ కృష్ణా రెడ్డి అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…