Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ఉల్టా పుల్టా కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమం అనుకున్న స్థాయిలోనే మంచి ఆదరణ పొందిందని చెప్పాలి గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ అత్యధికంగా రేటింగ్ సొంతం చేసుకుంది. ఇక ఈవారం ఇప్పటికే 13 వారాలను పూర్తిచేసుకుని 14వ వారంలోకి అడుగు పెట్టింది 13వ వారంలో భాగంగా హౌస్ నుంచి గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా ఏడుగురు కంటెస్టెంట్లు ఇప్పుడు హౌస్ లో కొనసాగుతున్నారు అయితే ఈ వారం ఒకరిని మిడ్ వీక్ ఒకరిని ఎలిమినేట్ చేస్తే 5 మంది కంటెస్టెంట్లు ఫైనల్స్ కు వెళ్తారు అలా కాకుండా ఈసారి సీజన్ సెవెన్ కావడంతో ఏడుగురిని కూడా ఫైనల్స్ కు తీసుకు వెళ్తున్నారు అంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ వారం నాగార్జున కంటెస్టెంట్లతో మాట్లాడుతూ వారికి ప్రైజ్ మనీ గురించి వివరించారు.
ఈ సీజన్లో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారికి ట్రోఫీతో పాటు బిగ్ బాస్ వారి ప్రైస్ మనీ 50 లక్షలు అలాగే జోయాలుకాస్ వారి 20 లక్షల ప్రైజ్ మనీ ఇక ఒక కారు కూడా బహుమానంగా ఉండబోతుందని నాగార్జున తెలియజేశారు. అలాగే ఈ ప్రైజ్ మనీ గెలిచినవారు ఆ డబ్బుతో ఏం చేస్తారని కూడా ప్రతి ఒక్కరిని నాగార్జున అడిగారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక్కో రీజన్ చెప్పారు. కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం చెప్పిన రీజన్ అందరిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి.
రైతు కుటుంబాలకు ఇస్తాను…
ఒక రైతు బిడ్డగా రైతు కష్టాలు తెలిసినటువంటి పల్లవి ప్రశాంత్ తాను బిగ్ బాస్ కార్యక్రమంలో కనుక గెలిస్తే ఆ డబ్బును చనిపోయిన రైతుల కుటుంబాలకు మాత్రమే ఇస్తానని తెలియజేశారు. ఇలా ఈయన చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలకు అందరూ ఫిదా కాగా అక్కడ ఉన్నటువంటి నాగార్జునతో పాటు మిగిలిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టారు. ఇక టైటిల్ రేసులో అమర్ పల్లవి ప్రశాంత్ ఉన్నారని చెప్పాలి.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…