Paritala Nirupam -Manjula: బుల్లితెర నటీనటులుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో పరిటాల నిరూపమ్ మంజుల దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడు నిరూపమ్ కార్తీకదీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ప్రస్తుతం ఈ భార్యాభర్తలిద్దరూ కూడా పలు సీరియల్స్ లో నటిస్తూ మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా సందడి చేస్తున్నారు.
ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మంజుల తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా వీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా తమకి ఒక కొత్త ఇల్లు ఉందని త్వరలోనే ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవ్వబోతున్నాం అంటూ తెలియచేశారు.
ఈ సందర్భంగా మంజుల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఇల్లు మొత్తం తిరిగి చూపించారు. ప్రస్తుతం ఇంటీరియర్ డిజైన్ జరుగుతుందని త్వరలోనే ఈ ఇంట్లోకి మారబోతున్నామని తెలిపారు. ఇక ఈ ఇంటి గురించి డాక్టర్ బాబు కూడా మాట్లాడుతూ… ఇల్లు తన తండ్రి బుక్ చేశారని సినీ కార్మికుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన హౌసింగ్ సొసైటీ ద్వారా ఇల్లు వచ్చిందని తెలిపారు.
ఇలా ఈ ఇల్లు సాంక్షన్ అయిన తర్వాత నాన్నగారు చనిపోవడంతో అది తన పేరు మీద మారడానికి ఆలస్యమైందని, ఈ ఇల్లు బుక్ చేసి కూడా దాదాపు 18 సంవత్సరాలు అవుతుందని తెలిపారు. ముందు ఈ ఇంటిని 3 HBK అనుకున్నారు. ఆ తర్వాత దానిని డూప్లెక్స్ ఫ్లాట్ గా అప్డేట్ చేశారని ఈయన తెలియజేశారు. అలా ఈ ఇల్లు మరింత ఆలస్యం అవుతూ వచ్చిందని ఈ సందర్భంగా నిరుపమ్ వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…