Mamatha Mohan Das:దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా పలుభాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వారిలో మమతా మోహన్ దాస్ ఒకరు. ఈమె నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె పలు సినిమాలలో నటించి మెప్పించారు. అయితే క్యాన్సర్ బారిన పడటంతో కాస్త సినిమాలను తగ్గించారు.
ఇకపోతే తాజాగా మమత ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పరోక్షంగా నటి నయనతార గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.రజనీకాంత్ నటించిన ఒక సినిమాలో ఒక పాటలో డాన్స్ చేసే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. అయితే ఈ పాటలో దాదాపు నాలుగు రోజులపాటు షూటింగ్ కూడా చేశామని అయితే ఆ సినిమాలో నటించిన హీరోయిన్ కారణంగా తాను ఆ పాటలో పూర్తిగా కనిపించకుండా పోయాను అని తెలిపారు.
రజనీకాంత్ హీరోగా నటించిన కథానాయకుడు సినిమాలో దేవుడే స్వర్గం నుంచి సాంగ్ లో మమతా మోహన్ దాస్ కొన్ని సెకన్ల పాటు మెరిశారు. అయితే ఇందులో నటించినటువంటి హీరోయిన్ తాను ఈ పాటలో మరొక హీరోయిన్ కనిపిస్తే చేయనని కండిషన్ పెట్టడంతోనే చిత్ర బృందం తనని సైడ్ చేశారని అందుకే తాను ఈ పాటలో కనిపించలేదని ఈ సందర్భంగా ఈమె షాకింగ్ చేశారు.
ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించారు. నయనతార కారణంగానే తనకు ఈ పాట విషయంలో అవమానం జరిగిందంటూ పరోక్షంగా నయనతార పేరును బయటకు తీసుకురాకుండా మమత మోహన్ దాస్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి మరి ఈమె చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై నటి నాయనతర స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…