Parthiban -Seetha: తమిళ భాషలో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించిన నటి సీత అనంతరం పలు తెలుగు తమిళ భాషలలో ఎంతోమంది యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో సక్సెస్ అయినటువంటి ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారు.
పాండ్యరాజన్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం అన్ పావం.ఈ సినిమా ద్వారా నటిగా పరిచయమయ్యారు సీత. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు వరుసగా తెలుగు తమిళ భాషలలో అవకాశాలు వచ్చాయి. సినిమాలలో నటిస్తున్న సమయంలోనే సీత పార్థిబన్ తొలిసారిగా ఆయన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కిన చిత్రం పుదియ పాదై సినిమాలో హీరోయిన్గా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడటం అల వీరిద్దరూ 1990లో వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు.ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో పలు మనస్పర్ధలు కారణంగా 2001 వ సంవత్సరంలో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా మనస్పర్ధలు కారణంగా విడిపోయిన వీరిద్దరూ తాజాగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలోనే పార్దివన్ తాము విడాకులు తీసుకొని విడిపోవడానికి సీత అత్యాశ కారణమని తెలియజేశారు.
ఇలా తను డబ్బు కోసం ఆశపడటం వల్లే మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయామని చెప్పడంతో ఈ వ్యాఖ్యలపై నటి సీత స్పందించారు. తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నటిని అని తెలిపారు. నటి సుహాసిని ఒక సినిమాలో నా భర్త నాకే సొంతం కావాలనుకోవడం తప్ప అంటూ ఈమె చెప్పడమే కాకుండా తన మాజీ భర్త చెప్పినవన్నీ కూడా ఆ వాస్తవాలేనని కొట్టి పారేశారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…