General News

బీసీ రాగం బలంగా వినిపిస్తున్న పార్టీలు.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలన్నీ అదే దారిలో..

రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల బీసీ సామాజిక వర్గాలే కేంద్రబిందువుగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి, అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ దీనికి అవసరమైన ఆమోదం ఇంకా లభించలేదు. ఈ నేపథ్యంలో, ప్రస్తుత మునిసిపల్ ఎన్నికల్లో బీసీలకు అధిక సంఖ్యలో సీట్లు కేటాయించడం ద్వారా పార్టీలూ తమ హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఇదే దారిలో అడుగులు వేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో బీసీలకు అన్ని ప్రధాన పార్టీలు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ మూడు పార్టీలూ బీసీ అభ్యర్థులకే పెద్దపీట వేశాయి. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో బీసీ టికెట్లు గణనీయంగా పెరిగాయి. మొత్తం సీట్లలో కాంగ్రెస్ పార్టీ 53.71 శాతం బీసీలకు కేటాయించగా, బీఆర్‌ఎస్‌ స్వల్పంగా ముందంజలో నిలిచి 53.79 శాతం సీట్లు ఇచ్చింది. బీజేపీ మాత్రం 49.89 శాతం సీట్లను బీసీలకు కేటాయించింది.

గమనించదగ్గ అంశం ఏంటంటే… 42 శాతం రిజర్వేషన్ హామీని మించిపోయేలా పార్టీలు సీట్లు ఇవ్వడం. కొన్ని జిల్లాల్లో ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 67.66 శాతం సీట్లు బీసీలకు కేటాయించింది. అదే జిల్లాలో బీఆర్‌ఎస్‌ 60 శాతం, బీజేపీ 61 శాతం సీట్లు ఇచ్చాయి. కొన్ని చోట్ల అధికార పార్టీకంటే ప్రతిపక్షమే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ఉదాహరణలూ ఉన్నాయి.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 మునిసిపాలిటీల్లో మొత్తం 294 వార్డులు ఉండగా, బీఆర్‌ఎస్‌ 127 మంది బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 121 మంది బీసీలను బరిలోకి దించింది. బైంసా మునిసిపాలిటీలో బీఆర్‌ఎస్‌ 46 శాతం వార్డులను బీసీలకు కేటాయించగా, కాంగ్రెస్ 26 శాతం మాత్రమే ఇచ్చింది. నిర్మల్‌లో బీజేపీ ఏకంగా 90 శాతం సీట్లు బీసీలకు ఇవ్వగా, బీఆర్‌ఎస్‌ 71 శాతం, కాంగ్రెస్ 57 శాతం సీట్లు కేటాయించడం గమనార్హం.

బీసీల తర్వాత ఎస్సీ వర్గాలకు కాంగ్రెస్ 19 శాతం, బీఆర్‌ఎస్‌ 18.66 శాతం, బీజేపీ 15.80 శాతం సీట్లు ఇచ్చాయి. ఎస్టీల విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ రెండూ సమానంగా 7.66 శాతం సీట్లు కేటాయించగా, బీజేపీ 7.05 శాతం సీట్లు ఇచ్చింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో పోటీ చిత్రమే స్పష్టమైంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మునిసిపాలిటీల్లో 2,582 వార్డులు, ఏడు కార్పొరేషన్లలో 414 డివిజన్లు కలిపి మొత్తం 2,996 స్థానాలు ఉన్నాయి. వీటికి మొత్తం 12,993 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago