Categories: FeaturedMovie News

చంద్రమోహన్ ఓ పీనాసి.. !! (పరుచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు)

“పరుచూరి పలుకులు” ద్వారా తన యూట్యూబ్‌ ఛానల్లో తెలుగు చలన చిత్రసీమకి సంబంధించిన ప్రముఖుల గురించి, అలాగే టాలీవుడ్ లో తెర వెనుక జరిగే కథలను గురించి ఫ్యాన్స్ కు వివరించే పరుచూరి గోపాలకృష్ణ ఈసారి ప్రముఖ సీనియర్ నటుడు, అలనాటి హీరో చంద్రమోహన్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఒక వీడియో రూపంలో తెలియజేశారు.

చంద్రమోహన్‌ది పమిడి ముక్కల గ్రామం. మాది మేడూరు. ఇద్దరివీ ప్రక్క ప్రక్క ఊర్లే.. అలాగే 
చంద్రమోహన్ మా అన్నయ్య పరుచూరి వెంకటేశ్వరరావు క్లాస్ మేట్. బెంచ్ మేట్ కూడా.! మా అక్క కూడా అక్కడే చదివారు. నాతో పెద్దగా పరిచయం లేకపోయినా అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్తుండేవారు చంద్రమోహన్. బాగా చదివుకున్నారని మా అన్నయ్యకి మంచి పేరు ఉండేది. ఆ రోజుల్లో ఆయన చేతివ్రాతకి కూడా నూటికి నూరు మార్కులు పడేవి. ఇదిలావుండగా మాకన్నా ముందుగానే చంద్రమోహన్ సినిమాల్లోకి వచ్చారు. చంద్రమోహన్ నటించిన “రంగుల రాట్నం” సినిమా చాలా సార్లు చూశాం. మా ఊరివాడు, పొట్టివాడైనా చాలా గట్టివాడు అని తెగ సంబర పడిపోయాము. సిరి సిరి మువ్వ, శంకరాభరణం సినిమాలు చూస్తే.. అతను ఆ పాత్రలలో ఉన్నాడా.. లేక ఆ పాత్రలే అతనిలోకి వెళ్లిపోయాయా.? అనేంత అద్భుతంగా ఆ పాత్రలను పండించాడు. చాలా కొద్ది మంది సహజ నటుల్లో చంద్రమోహన్ ఒకరు.

అలాగే టాలీవుడ్ లో చాలా మంది చంద్రమోహన్‌ని పిసినారి అని అంటూ వుంటారు. కానీ ఆ మాటకి నేను ఒప్పుకోను. మారుతున్న కాలానుగుణంగా ఆమాత్రం జాగ్రత్త వుండాలి. అందుకే అతను జాగ్రత్త పరుడు అంటాను. మనకి ఒక రూపాయి వస్తే.. ఆ రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలో.. అందులో ఎంత దాచుకోవాలో బాగా తెలిసిన ఆర్ధిక నిపుణుడు చంద్రమోహన్. ఒకవిధంగా చెప్పాలంటే.. టాలీవుడ్ లో శోభన్ బాబు, మోహన్ బాబు, శ్రీధర్, చంద్ర మోహన్ ఈ నలుగుర్నీ ఆదర్శంగా తీసుకుంటే ఎవరి ఆస్తులు వాళ్ళ దగ్గరే ఉంటాయి. వాళ్లు నిజంగా గొప్పవాళ్లే. ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా దాచారు. దాన్నే నేటితరం పిసినారి తనం అంటున్నారు. చంద్ర మోహన్ తాను జాగ్రత్తగా ఉండటమే కాకుండా.. తన భార్యాపిల్లలను కూడా చక్కగా తీర్చిదిద్దారు. చంద్ర మోహన్‌తో త్వరలోనే ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం. కథ కూడా సిద్ధం చేసేశాం. చంద్రమోహన్ ఎప్పటికీ ఇలాగే బాగుండాలి.. ఆయన్ని చూసి చాలా మంది చాలా విషయాలు నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ “పరుచూరి పలుకులు” కార్యక్రమానికి ముగింపు పలికారు టాలీవుడ్ రచయిత, నటుడు 
పరుచూరి గోపాలకృష్ణ.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago