Featured

Paruchuri Gopalakrishna : సైరా నరసింహారెడ్డి మేము కోరుకున్నట్లు రాలేదు, కానీ…: పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopalakrishna : పరుచూరి బ్రదర్స్ అనగానే రచయితలుగా వారు అందించిన సినిమాలు గుర్తు వస్తాయి. రచయితలుగానే కాకుండా డైలాగ్ రైటర్స్ గా, నటులుగా వారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తమదైన చెరగని ముద్ర వేసుకున్నారు. ‘అనురాగ దేవత’ సినిమాతో మొదలైన వీరి సినీ ప్రస్థానం ‘సైరా నరసింహారెడ్డి’ వరకు కొనసాగింది. ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంభాషణలను అందించిన పరుచూరి బ్రదర్స్ మాస్ డైలాగులకు ఫేమస్. ప్రస్తుతం సినిమాలకు పెద్దగా పనిచేయడం లేదు. అందులో పరుచూరి గోపాలకృష్ణ గారు మాత్రం యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఎంతో మంది సినిమా డైరెక్టర్స్ కావాలనుకుంటున్న వారికి గైడెన్స్ ఇస్తూ అలానే ఒక సినిమా కథను చర్చిస్తూ విశ్లేషస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సైరా నరసింహారెడ్డి సినిమా గురించి మాట్లాడారు.

ఆ సినిమా ఫలితం మేమనుకున్నట్లు రాలేదు…

చిరంజీవి గారు చాలా గ్యాప్ తరువాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో మళ్ళీ ప్రేక్షకులకు ముందుకు వచ్చారు. అలా ఆ సినిమా తరువాత హిస్టారిక్ సినిమా అయిన సైరా నరసింహారెడ్డి సినిమా చేసారు. ఆ సినిమాకు డైలాగులను పరుచూరి సోదరులు అందించారు. అయితే సినిమాలో డైలాగులు బాగా వచ్చాయని కాకపోతే సినిమా ఆశించినంత విజయం సాధించలేదు అంటూ అభిప్రాయపడ్డారు.

అయితే సినిమాలో డైలాగులకు చాలా మంది రాయలసీమ నుండి అభిమానులు, సినిమా చూసిన ప్రేక్షకులు ఫోన్లు చేసి అభినందించారు. డైలాగులు చెప్పడంలో తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ ఇలా ఎవరికి వారే సాటి, అద్భుతంగా చెప్తారు అంటూ పరుచూరి గోపాల కృష్ణ గారు అభిప్రాయాపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago