Pavala shyamala : తెలుగులో సీనియర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన పావలా శ్యామల ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో కాళ్ళు లేని కూతురుతో ఆర్ధిక కష్టాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీ నుండి ఎటువంటి సహాయం రాలేదంటూ ఆవిడ కామెంట్స్ చేసారు. బాగోలేదు సీరియస్ గా ఉంది అంటూ అందరికీ సందేశం వెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. సహాయం చేయడం పక్కన పెడితే ఎవరూ ఎలా ఉన్నావ్ అని కూడా అడగలేదు అంటూ బాధపడ్డారు. ప్రస్తుతం కూతురుతో కలిసి ఆశ్రమంలో ఉంటున్న ఆమె ఆమె పై వస్తున్న పుకార్లకు క్లారిటీ ఇవ్వడానికి ఇంటర్వ్యూ ఇచ్చారు.
మెగా స్టార్ మెగా సాయం చేశారు…
కూతురు అనారోగ్యంతో బాగోలేక పోతే కొంతమంది ప్రొడ్యూసర్లు సహాయం చేసారని చెప్పిన శ్యామల గారు మా అసోసియేషన్ మెంబెర్ షిప్ ఐదు వేలు ఉన్నపుడు చేసుకోలేదు తీరా సభ్యత్వం తీసుకుందామని అనుకున్నపుడు లక్ష రూపాయలు అయింది. దీంతో నావల్ల కాదని అనుకున్నపుడు చిరంజీవి గారు లక్ష రూపాయలు కట్టి ఆయనే మెంబెర్ షిప్ ఇప్పించారు. ఇక కూతురు ఆరోగ్యం కోసం ఒక రెండు లక్షల సహాయం చేసారు అంటూ చెప్పారు. ఇక మా ప్రెసిడెంట్ మంచు విష్ణు అయ్యాక సహాయం అడిగితే అసోసియేషన్ తరుపున ఒక మనిషిని నా బాధ్యతలు చూసుకోమని పెట్టారు.
ఆ అమ్మాయి ఆపరేషన్ చేయించుకోమని చెప్పింది. నాకు డాక్టర్లు గుండె ఆపరేషన్ చేయించుకుంటే నీ శరీరం తట్టుకోలేదు వద్దని చెప్పడం తో నేను చేయించుకోను అని చెప్పాను. ఇక ఆ తరువాత ఆ మహిళ మీకు నాకు ఇక ఏ సంబంధం లేదు నాకు ఫోన్ చెయ్యొద్దు అని చెప్పింది. ఆ తరువాత మా అసోసియేషన్ నుండి ఎవరి నుండి ఒక పలకరింపు కుడా లేదు. కేవలం నెలకు నేను కట్టిన లక్ష రూపాయలకు వడ్డీగా 6000 రూపాయలను బ్యాంకు అకౌంట్ లో వేస్తుంటారు అంతే నేను ఉన్నానో లేదో కుడా వదిలేసారు అంటూ బాధపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…