ప్రముఖ సీనియర్ నటి పావల శ్యామల ఉపాధి లేక ఈ కష్టకాలంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పావల శ్యామలకు మా తరపున సభ్యత్వ కార్డ్ నిమిత్తంగా 1,01,500 (1లక్షా 1500) చెక్ ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ సభ్యులు కరాటే కళ్యాణి, సురేష్ కొండేటి స్వయంగా అందించారు. ఇకపై కొత్త సభ్యురాలైన పావలా శ్యామల గారికి ‘మా’ మెంబర్ షిప్ కార్డ్ తో నెలకు 6 వేల చొప్పున ప్రతినెలా పెన్షన్ రూపంలో ఆమెకు ‘మా’ అందించేలా ఆమెకు చేయూతనందించారు. ఈ నేపథ్యంలో సాయం చేయడానికి వెళ్లిన తనను బాధపట్టేట్టుగా శ్యామల మాట్లాడిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కరాటే కళ్యాణి.
ఆమెకు డబ్బు తప్పు ఏం ఇచ్చినా తీసుకోవడం లేదని.. కనీసం డబ్బులు బ్యాంక్‌లో వేస్తాం అన్నా ఒప్పుకోవడం లేదని.. కుక్కర్, కూలర్ తీసుకుని వెళ్తే ఇలాంటివి నేను వాడని తిరిగి ఇచ్చేయడమే కాకుండా.. తన పరువుని రోడ్డుని పెట్టానంటూ ఇష్టం వచ్చిన మాట్లాడిందని కరాటే కళ్యాణి ఆరోపించింది. అయితే వీటిపై పావలా శ్యామల కౌంటర్ ఇస్తూ.. కరాటే కళ్యాణి పేరు ప్రస్తావించకుండానే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
‘కష్టంలో ఉన్నప్పుడు సాయం చేస్తాం అని వచ్చి.. బయటకు వెళ్లి నా గురించి బ్యాడ్‌గా మాట్లాడటం సంస్కారం కాదు. నాపై ఉంటే కోపం ఉంటే తరువాత చూసుకోవాలి.. నాలో తప్పు ఉండొచ్చు… లోపాలు ఉండొచ్చు.. కానీ విమర్శించడానికి ఇది టైం కాదు. నేను నా బిడ్డ కష్టాల్లో ఉన్నాం.. దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాం.కష్టంలో ఉన్న నాపై నిందలు వేయడం న్యాయం కాదు. నేను కోలుకోవాలి.. నా బిడ్డను రక్షించుకోవాలి. కష్టంలో ఉన్న వాళ్లపై రాళ్లు వేస్తే మహా పాపం. నాపై రూమర్లు ఎందుకు? ఒకవేళ నాలో తప్పు ఉంటే.. పాపం ఆవిడకు వయసు అయిపోయింది.. మాట్లాడలేకపోతుంది అని కవర్ చేయాలి. అది కదా సంస్కారం అంటే.. అంతేకానీ.. ఆమెకు వస్తువులు ఇస్తే తీసుకోదు.. డబ్బులే కావాలని అంటుంది.. ఇంకా ఇంకా కావాలని అంటుందని ఒకామె అంటున్నారట. కష్టంలో ఉన్న నాపై నిందలు వేయడం న్యాయం కాదు. నేను కోలుకోవాలి.. నా బిడ్డను రక్షించుకోవాలి.
కష్టంలో ఉన్న వాళ్లపై రాళ్లు వేస్తే మహా పాపం. నాపై రూమర్లు ఎందుకు? ఒకవేళ నాలో తప్పు ఉంటే.. పాపం ఆవిడకు వయసు అయిపోయింది.. మాట్లాడలేకపోతుంది అని కవర్ చేయాలి. అది కదా సంస్కారం అంటే.. అంతేకానీ.. ఆమెకు వస్తువులు ఇస్తే తీసుకోదు.. డబ్బులే కావాలని అంటుంది.. ఇంకా ఇంకా కావాలని అంటుందని ఒకామె అంటున్నారట.ఎందుకమ్మా ఇవన్నీ.. ఆర్టిస్ట్ మీద బురద జల్లి సంతోషపడకండి. నేను చెడ్డదాన్నే.. తిడతాను.. కరెక్టే కానీ నేను కష్టంలో ఉన్నప్పుడు ఆ విషయం పబ్లిక్‌లో చెప్పకూడదు. అలా చెప్పావంటే నువ్వూ దుర్మార్గురాలివే. నన్ను మానసికంగా బాధపెట్టొద్దు.
దీన స్థితిలో ఉండి బలవంతంగా ప్రాణాలు తీసుకోలేక.. పరువు తీసుకుంటున్నా. ప్రాణ త్యాగం చేయలేక అడుక్కుంటున్నా.. ప్రాణాలను తీసుకోలేక నా బిడ్డను బతికించుకోవడం కోసం చేతులు చాస్తున్నా.. నా కూతుర్ని చంపలేను కదా.. నిజంగా నేను తప్పు చేస్తే విమర్శించడానికి ఇదా సమయం. నేను బ్రాహ్మణ్.. నిరంతరం దేవుడ్ని స్మరించుకుంటా.. నాపై అన్యాయంగా ఆరోపణలు చేయొద్దు.. మీకు ఇష్టం ఉంటే సాయం చేయండి.. దయచేసి నన్ను దూషించకండి” అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది పావలా శ్యామల…!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…