Categories: FeaturedMovie News

Pavan Kalyan : జనసేనాని వల్ల నష్టపోతున్న ఆ నిర్మాతలు… సినిమాలు పట్టాలెక్కేది ఎప్పుడో…!

Pavan Kalyan : జనసేనాని ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. అయితే అది సినిమాల్లో కాదు రాజకీయాల్లో. ఏపీ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల లక్ష్యంగా పనిచేస్తున్నారు. అటు కార్యకర్తలను ఉతేజపరుస్తూనే, కౌలు భరోసా యాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో భరోసా యాత్ర పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నెక్స్ట్ ఎలక్షన్ కి పొత్తులు, వ్యూహాల సమాలోచనలు చేస్తూనే పార్టీని బలోపేతం చేస్తున్నారు. దీంతో రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలు చేసే పరిస్థితి లేదు.

కమిట్ అయిన నిర్మాతలు నష్టపోతున్నారు…

ఇక పవన్ ఇప్పటికీ కొన్ని సినిమాలు ప్రాజెక్ట్స్ కి ఓకే చేసారు. హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ జరుగుతుండగా, హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమాను చేయాల్సి ఉన్నా ఆ సినిమా ఉందొ లేదో తెలియదు. ఈ విషయం పై ఆగిపోయింది అంటూ వార్తల నేపథ్యంలో చిత్ర నిర్మాతలు స్పందించడం లేదు. ఇక తాజాగా వినిపిస్తున్న మరో వార్త హరిహర వీర మల్లు సినిమా షూటింగ్ అయిపోయింది అని అంటున్నారు. ఏ ఎమ్ రత్నం ఈ సినిమాకు నిర్మాత కాగా ఆయన అయోమయ పరిస్థితిలో ఉన్నారట.

ఇక హరీష్ శంకర్ తో సినిమాలు విషయంలోనూ ఏం క్లారిటీ రావడంలేదు. పవన్ కు సన్నిహితుడు, జనసేన పార్టీ లీడర్ తాళ్లూరి రామ్ నిర్మాణ సంస్థలోనూ ఒక సినిమా చేయాల్సింది. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలోనూ ఒక సినిమాలు పవన్ ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థలను పవన్ అయోమయంలో నెట్టేసాడు. ఇక ఈసినిమాలు ఎప్పుడు పట్టాలెక్కాలి, సినిమాలు ఎప్పుడు పూర్తి కావాలి ఇక పవన్ మళ్ళీ మొహానికి ఇప్పట్లో రంగు వేసుకుంటాడో లేదో ఎవరికీ క్లారిటీ లేదు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 months ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago