Pavan Kalyan : జనసేనాని ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. అయితే అది సినిమాల్లో కాదు రాజకీయాల్లో. ఏపీ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల లక్ష్యంగా పనిచేస్తున్నారు. అటు కార్యకర్తలను ఉతేజపరుస్తూనే, కౌలు భరోసా యాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో భరోసా యాత్ర పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నెక్స్ట్ ఎలక్షన్ కి పొత్తులు, వ్యూహాల సమాలోచనలు చేస్తూనే పార్టీని బలోపేతం చేస్తున్నారు. దీంతో రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలు చేసే పరిస్థితి లేదు.

కమిట్ అయిన నిర్మాతలు నష్టపోతున్నారు…
ఇక పవన్ ఇప్పటికీ కొన్ని సినిమాలు ప్రాజెక్ట్స్ కి ఓకే చేసారు. హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ జరుగుతుండగా, హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమాను చేయాల్సి ఉన్నా ఆ సినిమా ఉందొ లేదో తెలియదు. ఈ విషయం పై ఆగిపోయింది అంటూ వార్తల నేపథ్యంలో చిత్ర నిర్మాతలు స్పందించడం లేదు. ఇక తాజాగా వినిపిస్తున్న మరో వార్త హరిహర వీర మల్లు సినిమా షూటింగ్ అయిపోయింది అని అంటున్నారు. ఏ ఎమ్ రత్నం ఈ సినిమాకు నిర్మాత కాగా ఆయన అయోమయ పరిస్థితిలో ఉన్నారట.

ఇక హరీష్ శంకర్ తో సినిమాలు విషయంలోనూ ఏం క్లారిటీ రావడంలేదు. పవన్ కు సన్నిహితుడు, జనసేన పార్టీ లీడర్ తాళ్లూరి రామ్ నిర్మాణ సంస్థలోనూ ఒక సినిమా చేయాల్సింది. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలోనూ ఒక సినిమాలు పవన్ ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థలను పవన్ అయోమయంలో నెట్టేసాడు. ఇక ఈసినిమాలు ఎప్పుడు పట్టాలెక్కాలి, సినిమాలు ఎప్పుడు పూర్తి కావాలి ఇక పవన్ మళ్ళీ మొహానికి ఇప్పట్లో రంగు వేసుకుంటాడో లేదో ఎవరికీ క్లారిటీ లేదు.



























