Pawan Kalyan: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల పండుగ మొదలైంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీగా క్యూ కట్టారు. వాతావరణం కూడా అనుకూలించడంతో పెద్ద ఎత్తున ఓటర్లు ముందుకు కదిలి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఏపీలో కూడా భారీ స్థాయిలో ఓట్లు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీ అధినేతలు, ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు కూడా తమ కుటుంబాలతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నప్పటికీ ఈయన మాత్రం మంగళగిరిలో ఓటు వేశారు.
పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి తన ఓటు హక్కును మంగళగిరిలో వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తన గాజు గ్లాసు గుర్తుపై కాకుండా సైకిల్ గుర్తుపై ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.
మంగళగిరిలో ఓటు..
ఈయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే విషయంపై చివరి వరకు క్లారిటీ లేకపోవడంతో తన ఓటు పిఠాపురం ట్రాన్స్ఫర్ చేయించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో మంగళగిరిలోనే ఓటు వేయాల్సి వచ్చింది అయితే మంగళగిరిలో జనసేన అభ్యర్థులు పోటీ చేయలేదు కనుక తప్పనిసరి పరిస్థితులలో టిడిపికే ఓటు వేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…