Featured

Pavithra Lokesh : సుచేంద్ర మొదటి భార్య, పవిత్ర మంచి ఫ్రెండ్స్… పవిత్ర సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నిజంగా పెళ్లి చేసుకుందా…!

Pavithra Lokesh : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి పాత్రలతో మెప్పించిన పవిత్ర ఒక డీసెంట్ ఇమేజ్ తో హోమ్లీ లుక్ తో అలరిస్తోంది. ఇంతవరకూ ఈమె వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. భర్త తో విడిగా ఉంది, ఇద్దరు పిల్లలు అని మాత్రమే అందరికీ తెలుసు. కానీ అసలు పవిత్ర లోకేష్ బ్యాక్ గ్రౌండ్, ఆమె వ్యక్తిగత వివరాల గురించి నరేష్ తో కలిసి తిరుగుతూ, పెళ్లి చేసుకుంటారంటూ పుకార్లు రావడం, ఇక ఈ రచ్చ మొత్తం ప్రస్తుతం తెలిసిందే. దీంతో పవిత్ర వ్యక్తిగత విషయాల గురించి అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

స్నేహితురాలి భర్తను పెళ్లి చేసుకుంది…

పవిత్ర లోకేష్ తండ్రి లోకేష్ కన్నడ సినిమాల్లో మంచి గుర్తింపు ఉన్న నటుడు. ఆయన కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవిత్ర లోకేష్ మొదట హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఇక సీరియల్స్ వైపు వెళ్ళింది. కన్నడ ఈటీవీ ఛానల్ లో ‘గుప్త గామిని’ అనే సీరియల్ లో హీరోయిన్ గా చేసింది. ఇక అదే సీరియల్ లో మరో హీరోయిన్ పాత్రలో మల్లిక అనే మరో యువతీ నటించింది. సీరియల్ లో కథనుసారం వీళ్ళిద్దరూ అక్కాచెల్లెళ్లు, ఇద్దరూ ఒకే వ్యక్తిని ఇష్టపడి ఒకరికి తెలియకుండా మరొకరు అతన్ని వివాహం చేసుకుంటారు. ఇక పవిత్ర, మల్లిక నిజ జీవితంలో మంచి స్నేహితులు. ఇక ఈ సీరియల్ లో హీరో పాత్ర సుచేంద్ర ప్రసాద్ చేసారు. అప్పటికే ఆయన ఇండస్ట్రీ లో బాగా ఫేమస్ రచయిత, డైరెక్టర్ మరియు నటుడు. ఇక ఆయన, సీరియల్ లో ఒక హీరోయిన్ అయిన మల్లికతో నిజంగా ప్రేమలో పడ్డారు. ఇక సీరియల్ టైములోనే పెళ్లి కూడా చేసుకున్నారు.

కొన్నాళ్ళు బాగా ఉన్నా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇక సుచేంద్ర, మల్లిక ల బంధం ఎన్నోరోజులు నిలవలేదు. ఇద్దరూ విడిపోయారు. ఇక అదే సమయంలో పవిత్ర లోకేష్ సుచేంద్ర ప్రసాద్ దగ్గరయ్యారు. 2006 లో సుచేంద్ర ప్రసాద్ తో మల్లిక విడిపోగా ఏడాది తరువాత పవిత్రను గుడిలో పెళ్లి చేసుకున్నా అది గోప్యంగా ఉంచారు ఇరువురు. అలా గుప్త గామిని సీరియల్ లో కొంచెం మార్పు తో రియల్ గా కుడా అలా ఇద్దరు స్నేహితులు ఒక్కరినే పెళ్లి చేసుకున్నారు. అయితే విడాకులిచ్చి చేసుకోవడం కొసమెరుపు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే పవిత్రకు ఇది మొదటి వివాహం కాదు. అప్పటికే హైదరాబాద్ లో ఈటీవీ సీరియల్స్ షూటింగ్ కోసం వస్తూ పోతూ ఉండే పవిత్ర హైదరాబాద్ లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. హైదరాబాద్ వస్తే అతడితోనే ఉండేదట. కానీ వీరి బంధం ఏడాది కూడా సాగలేదు. ఏడాది గడవకముందే విడిపోయారు, విడాకులు తీసుకుందో లేదో, ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. ఇక అలాగే సుచేంద్ర ప్రసాద్ మొదటి భార్య మల్లిక కూడా ఏమయ్యారో ఎవరికీ తెలియదు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago