Pavithra Lokesh : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి పాత్రలతో మెప్పించిన పవిత్ర ఒక డీసెంట్ ఇమేజ్ తో హోమ్లీ లుక్ తో అలరిస్తోంది. ఇంతవరకూ ఈమె వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. భర్త తో విడిగా ఉంది, ఇద్దరు పిల్లలు అని మాత్రమే అందరికీ తెలుసు. కానీ అసలు పవిత్ర లోకేష్ బ్యాక్ గ్రౌండ్, ఆమె వ్యక్తిగత వివరాల గురించి నరేష్ తో కలిసి తిరుగుతూ, పెళ్లి చేసుకుంటారంటూ పుకార్లు రావడం, ఇక ఈ రచ్చ మొత్తం ప్రస్తుతం తెలిసిందే. దీంతో పవిత్ర వ్యక్తిగత విషయాల గురించి అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

స్నేహితురాలి భర్తను పెళ్లి చేసుకుంది…
పవిత్ర లోకేష్ తండ్రి లోకేష్ కన్నడ సినిమాల్లో మంచి గుర్తింపు ఉన్న నటుడు. ఆయన కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవిత్ర లోకేష్ మొదట హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఇక సీరియల్స్ వైపు వెళ్ళింది. కన్నడ ఈటీవీ ఛానల్ లో ‘గుప్త గామిని’ అనే సీరియల్ లో హీరోయిన్ గా చేసింది. ఇక అదే సీరియల్ లో మరో హీరోయిన్ పాత్రలో మల్లిక అనే మరో యువతీ నటించింది. సీరియల్ లో కథనుసారం వీళ్ళిద్దరూ అక్కాచెల్లెళ్లు, ఇద్దరూ ఒకే వ్యక్తిని ఇష్టపడి ఒకరికి తెలియకుండా మరొకరు అతన్ని వివాహం చేసుకుంటారు. ఇక పవిత్ర, మల్లిక నిజ జీవితంలో మంచి స్నేహితులు. ఇక ఈ సీరియల్ లో హీరో పాత్ర సుచేంద్ర ప్రసాద్ చేసారు. అప్పటికే ఆయన ఇండస్ట్రీ లో బాగా ఫేమస్ రచయిత, డైరెక్టర్ మరియు నటుడు. ఇక ఆయన, సీరియల్ లో ఒక హీరోయిన్ అయిన మల్లికతో నిజంగా ప్రేమలో పడ్డారు. ఇక సీరియల్ టైములోనే పెళ్లి కూడా చేసుకున్నారు.

కొన్నాళ్ళు బాగా ఉన్నా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇక సుచేంద్ర, మల్లిక ల బంధం ఎన్నోరోజులు నిలవలేదు. ఇద్దరూ విడిపోయారు. ఇక అదే సమయంలో పవిత్ర లోకేష్ సుచేంద్ర ప్రసాద్ దగ్గరయ్యారు. 2006 లో సుచేంద్ర ప్రసాద్ తో మల్లిక విడిపోగా ఏడాది తరువాత పవిత్రను గుడిలో పెళ్లి చేసుకున్నా అది గోప్యంగా ఉంచారు ఇరువురు. అలా గుప్త గామిని సీరియల్ లో కొంచెం మార్పు తో రియల్ గా కుడా అలా ఇద్దరు స్నేహితులు ఒక్కరినే పెళ్లి చేసుకున్నారు. అయితే విడాకులిచ్చి చేసుకోవడం కొసమెరుపు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే పవిత్రకు ఇది మొదటి వివాహం కాదు. అప్పటికే హైదరాబాద్ లో ఈటీవీ సీరియల్స్ షూటింగ్ కోసం వస్తూ పోతూ ఉండే పవిత్ర హైదరాబాద్ లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. హైదరాబాద్ వస్తే అతడితోనే ఉండేదట. కానీ వీరి బంధం ఏడాది కూడా సాగలేదు. ఏడాది గడవకముందే విడిపోయారు, విడాకులు తీసుకుందో లేదో, ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. ఇక అలాగే సుచేంద్ర ప్రసాద్ మొదటి భార్య మల్లిక కూడా ఏమయ్యారో ఎవరికీ తెలియదు.































