Pavitra Lokesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు సంపాదించుకున్న నటి పవిత్ర లోకేష్ నటుడు నరేష్ రిలేషన్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వచ్చాయి. ఇక వీరిద్దరూ సహజీవనం చేస్తున్న విషయం కూడా తెలిసిందే. తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నటి పవిత్ర లోకేష్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ మాట్లాడుతూ విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ తిరిగి మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ బ్యానర్ తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు ఎంతో గర్వించదగిన విషయమని తెలిపారు. మాపై విజయనిర్మల కృష్ణ గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మళ్లీ పెళ్లి అనే సినిమాని విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ నిర్మించిన విషయం మనకు తెలిసిందే ఇందులో నరేష్ జీవిత కథ ఆధారంగా ఆయన జీవితంలో చేసుకున్నటువంటి పెళ్లిళ్ల గురించి చూపించబోతున్నారని తెలుస్తోంది. అదేవిధంగా ఈ సినిమాలో కృష్ణ కుటుంబ విషయాలను కూడా ప్రేక్షకులకు తెలియజేయబోతున్నారని తెలుస్తోంది. ఇలా ట్రైలర్ లాంచ్ లో పవిత్ర లోకేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…