Featured

Pawan Kalyan : ఎన్నికలకు సిద్ధమవుతున్న పవన్.. పార్టీ కోసం ఏకంగా 8 కార్లు కొనుగోలు..

Pawan Kalyan : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరుగా పవన్ కళ్యాణ్ స్థానం ప్రత్యేకమని చెప్పుకోవాలి. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీర మల్లు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయిడు భగత్ సింగ్ సినిమా రాబోతోంది. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న భవదీయిడు భగత్ సింగ్ సినిమాపై అభిమానులలో అంచనాలు భారీగానే వున్నాయి. అయితే ప్రస్తుతం సినిమాలాలో బిజీగా వున్న పవన్, ఎన్నికలు సమయం దగ్గరపడుతుందటంతో త్వరగా లైన్ లో వున్న ప్రాజెక్టలు పూర్తి చేసే పనిలో వున్నారట.

పార్టీ కోసం 8 కార్లు కొనుగోలు…..

తాజా సమాచారం ప్రకారం, 2023 సంవత్సరం ఏప్రిల్ నెల పాటికి లైన్ లో వున్న సినిమాలను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ త్వరలో ఏపీ రాష్ట్రం అంతటా పర్యటించనున్నారని, ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం దిశగా పవన్ కళ్యాణ్ ఎన్నికల అడుగులు వేయనున్నారని సమాచారం.

అయితే రాష్ట్ర పర్యటన కోసం పవన్ కళ్యాణ్ ఎనిమిది కొత్త కార్లు కొనుగోలు చేశారు. పవన్ కళ్యాణ్ ఏకంగా కోటిన్నర రూపాయలు ఈ కొత్త కార్ల కోసం ఖర్చు చేశారని వార్తలు. ఒక్కొక్క కారు విలువ దాదాపుగా 19 లక్షల రూపాయలగా చేరువగా ఉంటుందట. తన జనసేన పార్టీ కోసం పవన్ ఈ కార్లను కొనుగోలు చేసి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో తిరుపతి నుంచి ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. తిరుపతి నుంచి బరిలో దిగితే పవన్ కు విజయం వరిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago