Potti Naresh : ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది జీవితాలు మారిపోయాయి. జడ్జెస్ గా ఉన్న నాగబాబు, రోజాకు మళ్ళీ లైఫ్ ఇచ్చింది. ఇక చాలా మంది కమెడియన్స్ కి క్రేజ్ తెచ్చింది. సుధీర్, శీను, ఆది వంటి వారికి ఫుల్ క్రేజ్ తో పాటు సినిమా అవకాశాలను కుడా తెచ్చిపెట్టింది. ఇక ఇపుడు మరో జబర్దస్త్ కమెడియన్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో ఛాన్స్ కొట్టేసాడు. ఆ జబర్దస్త్ కమెడియన్ ఎవరో కాదు పొట్టి నరేష్.
అభిమాన హీరో సినిమాలో అవకాశం….
మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న తమిళ రీమేక్ సినిమా భోళా శంకర్ సినిమాలో పొట్టి నరేష్ ఛాన్స్ కొట్టేసాడు. కీర్తీ సురేష్ చెల్లెలుగా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో స్వయంగా చిరంజీవి గారే పొట్టి నరేష్ పేరును సిఫార్సు చేశారట. ఈ విషయాన్ని పొట్టి నరేష్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఆల్రెడీ రెండు రోజుల షూటింగ్ కూడా జరిగిందని. అభిమాన హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పాడు.
ఇక తన జీవితంలో ఉన్న అతి పెద్ద కోరిక సొంత ఇల్లు, సొంత కారు. ఇటీవలే సొంత కారు కొన్నాను, త్వరలోనే సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఇల్లు కొన్నాక పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. తాను పెళ్లి చేసుకుంటే అదొక వింత అవుతుందని చెప్పాడు. అయితే ఇంట్లో వాళ్ళు నా పెళ్లి విషయంలో తొందర పడటం లేదు నాపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…