Vignesh Shivan: నయనతార భర్త విగ్నేష్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.. డైరెక్టర్ కాక ముందు అలాంటి పనులు చేసారా?
Vignesh Shivan: విగ్నేష్ శివన్ దర్శకుడిగా నయనతార భర్తగా అందరికీ పరిచయమే.ఈయన తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు దర్శకుడిగా పని చేసి నయనతారను ప్రేమించి అనంతరం వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే నయనతారను పెళ్లి చేసుకున్న విగ్నేష్ కేవలం మనకు దర్శకుడిగా మాత్రమే తెలుసు. అయితే ఈయన దర్శకుడు కాక ముందు ఏం చేసేవారు, ఈయన గురించి ఎవరికీ తెలియని పలు ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
విగ్నేష్ దర్శకుడు కాకముందు ఈయన పాటల రచయితగా పని చేసేవారు. తమిళంలో ఈయన సుమారు 50 పాటలను రచించారు. ఇక ఈయన లిరిక్స్ అందించిన పాటలకు అనిరుధ్ సంగీతం అందించే వారు అలా అనిరుద్ విగ్నేష్ మంచి స్నేహితులయ్యారు. ఇక విగ్నేష్ దర్శకత్వం వహించే సినిమాలకు దాదాపు అనిరుద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తారు.
విగ్నేష్ దర్శకుడిగా ’నానుమ్ రౌడీదాన్’ తెరకెక్కిన చిత్రంలో నయనతార మొట్టమొదటిసారిగా నటించింది. ఈ సినిమా నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఇకపోతే ఈ సినిమా నుంచి నయనతారకు కథల ఎంపిక విషయంలో విగ్నేష్ ఎంతో సహాయం చేసేవారు. నయనతార ఏదైనా సినిమా చేయాలంటే ముందుగా విగ్నేష్ కథ ఓకే చేస్తేనే ఆ కథ నయనతార వరకు వెళుతుంది.
ఇక ఈయన పాటల రచయితగా, డైరెక్టర్ గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. అదేవిధంగా విగ్నేష్ శివన్ నటుడిగా కూడా సివి, పోడా పోడి, వంటి చిత్రాల్లో ఈయన తన యాక్టింగ్‌తో అదరగొట్టారు. ఇలా ఈయన ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ కలిగిన వ్యక్తి అని చెప్పవచ్చు. ఇకపోతే నయనతారతో ప్రేమలో పడిన విగ్నేష్ సుమారు ఏడు సంవత్సరాల పాటు పెద్దల అంగీకారం కోసం ఎదురు చూస్తూ వారి అంగీకారంతో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే వయసురీత్యా నయనతార కన్నా విగ్నేష్ ఒక ఏడాది చిన్న వాడు. నయనతార ఈ స్థాయిలో ఉండటానికి విగ్నేష్ కృషి ఎంతగానో ఉందని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…