Movie News

Pawan Kalyan: 15 రోజులకు 50 కోట్ల రెమ్యూనరేషన్… పవన్ క్రేజ్ మామూలుగా లేదుగా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరు మల్లు సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. అదే విధంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాని కూడా ప్రకటించారు. ఇక సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమాని కూడా అధికారికంగా ప్రకటించారు.

ఇలా వరుస సినిమాలకు కమిట్ అయిన పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి వినోదయ సితం అనే రీమేక్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ విషయాన్ని అధికారకంగా కూడా ప్రకటించారు.ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తన బిజీ షెడ్యూల్ కారణంగా కేవలం 15 రోజుల కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ 15 రోజులకు ఈయన తీసుకునే రెమ్యూనరేషన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా కోసం 15 రోజులకు గాను పవన్ కళ్యాణ్ ఏకంగా 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే ఒక రోజుకు పవన్ కళ్యాణ్ 3.3 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని తెలుస్తోంది. ఒక రోజుకు మూడు కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఇలా రోజుకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకోవడంతో పవన్ క్రేజ్ ఈయన స్టామినా ఏంటో తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Pawan Kalyan దేవుడు…


ఇక ఈ సినిమాకు గాను టైటిల్ విషయం గురించి ఓ వార్త వైరల్ గా మారింది. ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇందుకుగాను ముందుగా ఈ సినిమాకి దేవర అనే టైటిల్ అనుకున్నారట అయితే పవన్ కళ్యాణ్ సూచనలు మేరకు ఈ సినిమాకి దేవుడు అనే టైటిల్ ఖరారు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం గురించి ఎక్కడ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఏది ఏమైనా ఈ సినిమా టైటిల్ ఈ సినిమాకు పవన్ తీసుకుని రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago