Pawan Kalya: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భార్య అన్నాతో కలిసి కాశి విశ్వనాథుని దర్శనం చేసుకున్నారు. ఇలా సతీసమేతంగా పవన్ కళ్యాణ్ కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడంతో ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏపీలో ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుంచి లోక్ సభ స్థానానికి మూడోసారి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎన్డీఏ కూటమి అందరిని కూడా బిజెపి ఆహ్వానించింది. ఇలా కూటమి నేతల సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ ప్రక్రియ చాలా ఘనంగా జరిగింది.
ఈ నామినేషన్ ప్రక్రియ కోసం మన ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఇలా మోడీ నామినేషన్ పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి కాశి విశ్వనాథుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం మొత్తం తిరిగి ఆలయ గొప్పతనం తెలుసుకున్నారు.
కాశీలో పవన్..
ఇకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఈసారి ఎన్నికలలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఎన్నికలు పూర్తి చేసుకొని వెంటనే ఢిల్లీ వెళ్లి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మద్దతు తెలియజేశారు. ఇలా ఈ దంపతులిద్దరూ కాశీ యాత్రకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…