Movie News

Pawan Kalyan : వరుస సినిమాలతో రానున్న పవర్ స్టార్… కానీ ఒక్క కండిషన్ !

Pawan Kalyan : టాలీవుడ్​లో పవన్​ కళ్యాణ్​కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేయి ఎత్తితే చాలు ఏదైనా చేసేందుకు సిద్ధమైపోతుంటారు ఫ్యాన్స్​. ఆయనకు వాళ్లు కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు భక్తులు కూడా. ఏదైనా ఆయన సినిమా రిలీజ్​ అయితే ఆరోజు మాస్ జాతరే.. ఒక వేళ సినిమా ఫ్లాప్ అయినా ఆయన రేంజ్​ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు తీస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో ఫుల్​ బిజీగా గడుపుతున్నారు పవన్.

pawan kalyan conditions for upcoming films

పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి రెండూ కాదు కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 5 సినిమాలకు సైన్ చేశాడు పవర్ స్టార్. రాబోయే రెండేళ్లు పూర్తిగా బిజీగా ఉన్నాడు. మధ్యలో కరోనా రావడంతో అనుకున్న ప్లాన్స్ వర్క్ ఔట్ కావడం లేదు కానీ లేదంటే ఈ పాటికి పవన్ కళ్యాణ్ నటించిన రెండు, మూడు సినిమాలు విడుదలై ఉండేవి.

pawan kalyan conditions for upcoming films

ఇలా ఉంటే తన దగ్గర సినిమా చేయాలి అనుకునే దర్శక నిర్మాతలకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. అలాగే కొన్ని కండిషన్స్ అప్లై అంటున్నాడు ప‌వ‌న్. పవన్ ప్రస్తుతం భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధంగా ఉంది. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు కూడా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.

పవన్ పెట్టిన ఆ కండిషన్ కి మేకర్స్ ఓకే అంటారా ?

వీటితో పాటు హరీశ్‌ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలకు కమిట్ అయ్యాడు పవన్. త్వరలోనే ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్‌ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా భవదీయుడు భగత్ సింగ్. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక నుంచి పవన్ చేసే ఒక్కో సినిమాకు 60 రోజుల కాల్షీట్ మాత్రమే ఇస్తాడు అన్నమాట. కాబట్టి, ఆయనతో సినిమాలు ప్లాన్ చేసే వారంతా ఆ లోపే షూటింగ్ పూర్తి చేసేయాలి. కచ్చితంగా అలా చెయ్యాలని పవన్ కళ్యాణ్ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago