Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో ఆసక్తి కనబరిచారు. ఇలా రాష్ట్ర రాజకీయాలలో ఈయన ఎంత చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలో కూడా ఎంత చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరైన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావన వచ్చింది.అసలు తాను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను కానీ మూడు పెళ్లిళ్లు జరిగాయి అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజకీయపరంగా ఎలాంటి అవినీతి లేనటువంటి పవన్ కళ్యాణ్ ను ప్రస్తుతం అధికార పక్ష నేతలు తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ తనని టార్గెట్ చేశారు.
ఈ క్రమంలోనే తరచూ తన మూడు పెళ్లిళ్లు గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే బాలయ్య కూడా మూడు పెళ్లిళ్ల గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అయితే ఈయన మొదటిసారి కుటుంబ సభ్యుల సమక్షంలో 1997 వ సంవత్సరంలో నందిని అనే అమ్మాయిని ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే ఈమెకు 2007వ సంవత్సరంలో విడాకులు ఇచ్చి నటి రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకున్నారు.
ఇక ఈమెకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తనకి కూడా విడాకులు ఇచ్చి ప్రస్తుతం రష్యన్ యువతి అన్నా లేజినోవా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఈమెకు కూడా ఒక బాబు పాప కలరు. అయితే పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్న మొదటి అమ్మాయి నందిని ప్రస్తుతం ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది అనే విషయాన్ని వస్తే..
2007వ సంవత్సరంలో నందిని పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఈమె తన పేరును జాహ్నవిగా మార్చుకున్నారు. 2007వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న ఈమె 2010వ సంవత్సరంలో కృష్ణారెడ్డి అనే ఒక డాక్టర్ ను పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె తన భర్త పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నట్టు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…