Featured

Senior Journalist Bhardwaja : బాలయ్య, పవన్ కళ్యాణ్ అన్ స్టోపబుల్ ఎపిసోడ్లో ప్లస్ లు మైనస్ లు ఇవే…: సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bhardwaja : బాలకృష్ణ హోస్ట్ గా వస్తున్న అన్ స్టోపబుల్ షో ఆహా ఒరిజినల్స్ కే సూపర్ హిట్. షో వల్ల మొత్తం ఆహా సబ్స్క్రిప్షన్ కొన్నవాళ్లు ఉన్నారు. రేటింగ్స్ లో దుమ్ముదులుపిన ఈ షో సీజన్ 2 వచ్చేసింది. ఇక మొదటి ఎపిసోడ్ తోనే మళ్ళీ రికార్డులను తిరగశారు ఆహా వాళ్ళు. ఏకంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ లు ఈ షోకి వచ్చి కనువిందు చేసారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో యూత్ హీరోలతో సందడి చేసి బాలయ్య రచ్చ చేసాడు. ఇక తాజాగా అందరూ ఎదురుచూస్తున్న హాట్ కాంబినేషన్ వచ్చేసింది. అదే పవర్ ప్యాక్ హై వోల్టెజ్ పవన్ కళ్యాణ్ తో బాలయ్య అన్ స్టోపబుల్ ఇంటర్వ్యూ. ఇక ఈ పవర్ ప్యాక్ ఎపిసోడ్ మొదటి భాగం ఆహా లో ఆల్రడీ వచ్చేసింది. ఇక ఈ ఎపిసోడ్ గురించి రివ్యూ ఇచ్చారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు.

షోలో మైనస్ అదే…

పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఈ ఇద్దరి కాంబినేషన్ లో షో అందులోనూ అసలు టీవీ షోస్ లో కనపడని పవన్ కళ్యాణ్ మొదటి సారి టీవిలో కనిపించడంతో షో మీద అంచనాలు ఎక్కువయ్యాయి. ఇక ఆహా సైట్ క్రాష్ అవడం పక్కా అన్నట్లుగా హైప్ క్రియేట్ అయింది. అయితే షో అనుకున్నంత జోష్ గా లేదని ఏదో చప్పగా సాగిందంటూ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. బాలయ్య ఫుల్ జోష్ లో యాక్టీవ్ గా ఉన్నా పవన్ మాత్రం బాగా రిజిడ్ గా ఉన్నాడని కొంచం యాక్టీవ్ గా ఉండి ఉంటే షో ఇంకొంచం జోష్ తో ఉండేదంటూ చెప్పారు. ఇక షోలో జనాలు వినాలనుకున్న జవాబు వైసీపీ నేతలు ప్రతిసారి విమర్శించే మూడు పెళ్లిళ్ల వ్యవహారం గురించి. దీనికి సంబంధించిన ప్రశ్న ను బాలయ్య షోలో అడిగడం పవన్ దానికి జవాబు చెప్పడం బాగుంది.

అయితే పవన్ ఆన్సర్ చెప్పాక ఇక ఎవరైనా పవన్ ను మూడు పెళ్లిళ్ల విషయంలో కామెంట్స్ చేస్తే వాళ్ళు ఊర కుక్కలు అంటూ బాలయ్య చెప్పడం కొంచెం కొత్తగా ఉంది అంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు. అయితే షోలో రాజకీయాల గురించి ఎక్కువ ప్రశ్నలు వస్తాయని అందరూ భావించినా అలా కాకుండా ఫ్యామిలీ గురించి సాగడం కొంత చప్పగా అనిపిస్తుంది. కామన్ ఆడియన్ కు పవన్ ఫాన్స్ కి ఈ ఎపిసోడ్ నచ్చుతుంది కానీ ఎంతో ఎక్స్పెస్ట్ చేసిన కామన్ ఆడియన్ కి అంత గొప్పగా షో అనిపిచదు. రెండో పార్ట్ అయినా ఇంట్రస్టింగ్ గా ఉంటుందేమో చూడాలి అంటూ భరద్వాజ అభిప్రాయాపడ్డారు.

Bhargavi

Recent Posts

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కు కోర్టు నోటీసులు..!

తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…

12 hours ago

“హేమక్కా సారీ”.. వీడియోతో షాక్ ఇచ్చిన తమన్నా సింహాద్రి!

తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…

13 hours ago

చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకం.. వేణు మాధవ్ మరణం వెనుక నిజం ఇదే!

తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…

13 hours ago

‘తొలిప్రేమ’ డైరెక్టర్ కరుణాకరన్ కమ్‌బ్యాక్.. గణేష్ హీరోగా కొత్త సినిమా..!

తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…

13 hours ago

కేవలం 14 రోజులు ఈ పండు తింటే.. ముఖం మెరుస్తుందట!

వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…

14 hours ago

టీ తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ అలవాటు మానండి.. లేకపోతే పళ్ల సమస్యలు తప్పవు!

మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…

14 hours ago