Movie News

Balakrishna: మరో వివాదంలో బాలయ్య… క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసిన నర్సింగ్ సంఘం!

Balakrishna: హీరోగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణ ఈ మధ్యకాలంలో వరుస వివాదాలలో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే వీర సింహారెడ్డి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన ఓ కులం వారి గురించి తప్పుగా మాట్లాడటంతో సదురు కులస్తులకు బాలయ్యే క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

అదేవిధంగా అక్కినేని గురించి కూడా ఈయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇలా వరుసగా వివాదాలలో చిక్కుకుంటున్న బాలకృష్ణ తాజాగా మరోసారి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో భాగంగా బాలకృష్ణ తనకు రోడ్ యాక్సిడెంట్ జరిగిన విషయం గురించి గుర్తు చేసుకున్నారు. తాను కాలేజీ చదివే రోజుల్లో ఎక్కువగా బైక్ పై వెళ్లే వాడిని తెలిపారు. అయితే ఓ రోజు రోడ్డు క్రాస్ చేస్తుండగా మరొక బైక్ వచ్చి తనని ఢీ కొట్టిందని తెలిపారు.


Balakrishna బాలయ్య క్షమాపణలు చెప్పాల్సిందే…

ఇలా ప్రమాదం జరగడంతో తనని హాస్పిటల్ కి తీసుకువెళ్లారని అయితే తనకు ఆ సమయంలో వైద్యం అందిస్తున్నటువంటి నర్స్ గురించి ఈయన తప్పుగా మాట్లాడారు. దానెమ్మ ఆ నర్స్ ఏమో భలే అందంగా ఉంది.మొహం క్లీన్ చేస్తూ తనని ఏమైంది అంటూ అడిగారు నేను యాక్సిడెంట్ అయిందని చెప్పాను అని బాలయ్య తెలిపారు. అయితే ఒక నర్స్ ను పట్టుకొని ఇలా అగౌరవంగా మాట్లాడటంతో ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ ఓ ప్రకటనలో బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago