Featured

Vijaya Shanthi : ఆ రోజు చచ్చి బతికాను… అందరూ ఏడుపులు… 5వేల నుండి కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నా… ఫ్లైట్ ఆక్సిడెంట్ జరగడానికి కారణం…: హీరోయిన్ విజయశాంతి

Vijaya Shanthi : సినిమాల్లో అగ్ర హీరోయిన్ గా అందరు హీరోలతో నటించి లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయ శాంతి సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోను తనకంటూ మంచి గుర్తింపు అందుకుంది. తెలంగాణ సెపరేట్ రాష్ట్రంగా అవతరించాలన్న ఆశయంతో తల్లి తెలంగాణ పార్టీ పెట్టి పోరాడారు. రాజకీయ ఓనమాలు బీజేపీ లో నేర్చుకున్నా ఆపైన సొంత పార్టీ పెట్టి పరిస్థుల ప్రభావం వల్ల పార్టీని తెరాస లో విలీనం చేసి అటు మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్లి చివరకు బీజేపీలో కొనసాగుతున్న రాములమ్మ తన రాజకీయా ప్రస్థానం అలాగే సినిమాల గురించి ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఆరోజు చచ్చి బ్రతికాను…

విజయ శాంతి హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్లు అందుకుంది. అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమా అనగానే గుర్తొచ్చేది మొదట విజయ శాంతినే. ఆమె కర్తవ్యం, ప్రతిఘటన లాంటి ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలను తీసి వాటిని కూడా సూపర్ హిట్లుగా చేసారు. అలా యాక్షన్ సినిమాల్లో కూడా నటించిన విజయశాంతి ఆ సినిమాల్లో నటించేప్పుడు కొన్ని యాక్షన్ సన్నివేశాలకు డూప్ లేకుండా నటించారు. అలాంటి సినిమా షూటింగ్స్ లో చాలా సార్లు చచ్చి బతికాను అంటూ చెప్పారు. ఒక సారి ‘లేడీ బాస్’ సినిమా షూటింగ్ అరకులో చేస్తున్నపుడు ట్రైన్ సీన్ లో ఒక బోగీ నుండి మరో బోగీకి మారాలి, ఆ సమయంలో ప్రమాదం జరిగింది అలానే మరో సినిమా విజయ్ కాంత్ తో చేసినపుడు మంటలు అంటుకున్నాయి, విజయ్ కాంత్ గారు కాపాడారు అంటూ చెప్పారు.

ఇక మరోసారి చిరంజీవి, బాలకృష్ణ ఇలా అందరూ ఇండస్ట్రీకి చెందిన వారు ఫ్లైట్ ఆక్సిడెంట్ కి గురై నపుడు అందులో విజయశాంతి కూడా ఉన్నారు. 93 లో జరిగిన ఈ సంఘటనలో అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. దీపావళి పండగ కోసం చెన్నై వెళ్లిన వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ కి షూటింగ్స్ కోసం తిరిగి వెళ్తుండగా తిరుపతి శ్రీకాళహస్తి మధ్య పంట పొలాల్లో విమానం లాండ్ చేసారు. ఆ సంఘటన ఎవరూ మరచిపోలేము. ఆ పొలాల్లో ఒక పెద్ద బండ రాయి ఉంది, సరిగ్గా ఆ బండ రాయి కి కొంచెం ముందు విమానం ఆగిపోయింది. కొంచెం తగిలి ఉన్నా ముందు వరుసలో కూర్చున్న వారిలో నేను ఉన్నాను మేమంతా పోయేవాళ్ళం అంటూ చెప్పారు. ఇక మొదటి సినిమా కు 5000 వేల రెమ్యూనరేషన్ తీసుకున్న విజయశాంతి హీరోయిన్ గా పీక్స్ లో ఉన్నపుడు కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అప్పట్లో కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న వారిలో అమితాబ్, రజినీకాంత్ తరువాత విజయశాంతినే అని అప్పట్లో మ్యాగజైన్స్ లో కూడా వచ్చిందంటూ విజయశాంతి పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago