Surekha: సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి అడుగుపెట్టి రాజకీయాలలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా ఐదు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇలా రాజకీయాలలో పవన్ కళ్యాణ్ విజయం చూసి ఆయన కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ విజయాన్ని మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పండగలాగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదల చూసి తన అన్నయ్య చిరంజీవి వదిన సురేఖ ఎంతో గర్వపడుతున్నారు. మరి కొద్ది రోజులలో బాధ్యతలు తీసుకోబోతున్న పవన్ కళ్యాణ్ కు తన వదిన సురేఖ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగాను అలాగే మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకోబోతున్న నేపథ్యంలో ఈయనపై ఎన్నో బరువు బాధ్యతలు ఉంటాయి. అలాగే ఎన్నో ఫైళ్ళ పై సంతకాలు కూడా పెట్టాల్సి ఉంటుంది అయితే ఆ సంతకాలు అన్ని పెట్టడం కోసం సురేఖ తన మరిది కోసం ఖరీదైన పెన్నును కానుకగా ఇచ్చారు..
ఇలా సురేఖ తన మరిది కోసం పెన్ గిఫ్ట్ గా ఇస్తున్నటువంటి ఒక వీడియోని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో వెంటనే అభిమానులు ఈమె పవన్ కళ్యాణ్ కోసం ఎలాంటి పెన్ ఇచ్చారు. దాని ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలు పెట్టారు.. ఇక పవన్ కోసం సురేఖ ఇచ్చిన పెన్ మోంట్ బ్లాంక్ కంపెనీకి చెందినది. ఈ పెన్ను ఖరీదు 50వేల రూపాయల నుంచి లక్షల్లో ఉంటాయి.
మూడు లక్షల విలువ..
ఇక పవన్ కళ్యాణ్ కోసం తన వదిన సురేఖ ఇచ్చిన ఈ పెన్ను ఖరీదు ఏకంగా మూడు లక్షల 50 వేల రూపాయలు అని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. ఇలా తన కోసం తల్లి సమానురాలైన సురేఖ ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ సైతం ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…