Ram Charan: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈయన నటుడుగా కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయినటువంటి ఈయన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఇకపోతే నేడు ఫాదర్స్ డే కావడంతో చరణ్ తన కుమార్తె క్లిన్ కారాతో ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఫాదర్స్ డే సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ తన కుమార్తె గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తన కుమార్తె అందరిని బాగా గుర్తు పడుతుందని చరణ్ తెలిపారు.
ఇలాంటి సమయంలో తనని వదిలి షూటింగ్ వెళ్లాలంటే చాలా బాధగా ఉంటుందని తనని చాలా మిస్ అవుతున్నానని తెలిపారు. ఇక తను కూడా నన్ను చాలా మిస్ అవుతుందని చరణ్ వెల్లడించారు. ఇక నేను షూటింగ్ లేకుండా ఇంట్లో ఉంటే రోజంతా తనతోనే గడుపుతానని తనకు ప్రతిరోజు నేనే తినిపిస్తానని ఆ విషయంలో నాతో ఎవరూ పోటీ పడలేరని తెలిపారు. నేను తినిపిస్తే తన కుమార్తె మొత్తం తింటుందని ఈయన తెలిపారు.
చాలా మిస్ అవుతున్నా..
ఇలాంటి సమయంలో తనని వదిలి షూటింగ్ వెళ్లాలంటే కాస్త బాధగా ఉంటుంది అందుకే తాను స్కూల్ కి వెళ్లే వరకు కూడా షూటింగ్ కంటే ఎక్కువగా తనకి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో మెగా ఫాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…