Movie News

Pawan Kalyan: అలాంటి కండిషన్లతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే మరోవైపు రాజకీయ నాయకుడిగా కూడా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా రాజకీయ నాయకుడిగా కొనసాగుతూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మరోవైపు తనకు వీలు దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా మంచి ఆదరణ సంపాదించుకుని కలెక్షన్ల పరంగా భారీగా కలెక్షన్లను రాబడుతుంది. ఈ సినిమానే పవన్ కళ్యాణ్ కు ఆఖరి సినిమా అని ఈయన రాజకీయాలలో బిజీ కాబోతున్నారని అందరూ భావించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రకటించిన మరో మూడు సినిమాలు షూటింగ్ పనులను జరుపుకోవాల్సి ఉంది.

ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజి షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఇంతకుముందే ప్రారంభమైనటువంటి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మధ్యలోనే ఉండిపోయింది. అదేవిధంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ ప్రారంభించుకోలేదు. ఈ సినిమాలలో ఓజీ సినిమా మినహా మిగిలిన సినిమాలు అన్నీ కూడా ఎలక్షన్ల తర్వాతనే షూటింగ్ పనులు ప్రారంభిస్తారని అందరూ అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం హరీష్ శంకర్ ఉస్తాది భగత్ సింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Pawan Kalyan: 30 రోజులలో షూటింగ్ పూర్తి చేయాలి….


ఈ సినిమా మాస్ యాక్షన్ సినిమా కావడంతో ఎలక్షన్ల ముందు ఈ సినిమా విడుదలయితే తనకు కూడా కొంతమేర కలిసి వస్తుందని భావించిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే డైరెక్టర్ శంకర్ కి కొన్ని కండిషన్లు పెట్టారని తెలుస్తుంది. తన వద్ద కేవలం 30 కాల్ షీట్స్ మాత్రమే ఉన్నాయని, 30 రోజులలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని కండిషన్ పెట్టారట.సరైన హిట్టు లేక బాగా ఆకలితో ఉన్నటువంటి హరీష్ శంకర్ కు 30 రోజులు అంటే చాలా ఎక్కువ సమయం అని చెప్పాలి అయితే ఈ సినిమా ఆగస్టు రెండవ వారంలో షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుందని తెలుస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago