Political News

Pawan Kalyan: అదానీ జగన్ ముడుపుల వ్యవహారం.. సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్!

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా అదానీ జగన్ ముడుపుల వ్యవహారం గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఏపీలో విద్యుత్ ఒప్పందాల కోసం జగన్మోహన్ రెడ్డి  ఏకంగా 1750 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అదానీ పై అమెరికాలో కూడా కేసులు నమోదు కావడంతో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనగా మారింది.

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సిల్క్ యూనివర్సిటీ కోసం 100 కోట్ల రూపాయలు విరాళంగా అందుకున్నారు. అయితే అదానీ పట్ల కేసులో నమోదు కావడంతో ఆయన తీసుకున్నటువంటి ఆ వంద కోట్ల రూపాయలను కూడా తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక తాజాగా జగన్ అదానీ ముడుపుల వ్యవహారం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం స్పందించారు.

గత ప్రభుత్వం ఏపీలో చేసిన తప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం మేము వాటిని సరిదిద్దాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. ఇక జగన్ అదానీ విషయం గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సుదీర్ఘంగా చర్చలు జరిపి సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరించిందని కేవలం సమోసాల కోసమే 9 కోట్ల వరకు ఖర్చు చేసింది అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

Pawan Kalyan: సమోసాలకు తొమ్మిది కోట్లు..

ఇక వైకాపా నాయకులు మాత్రం అదానీ వ్యవహారం గురించి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు విద్యుత్ ఒప్పందంపై చేసుకున్న దాని కంటే చాలా తక్కువ ధరతో మేము విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నామని, ఒకవేళ అక్రమంగానే జగన్ ముడుపులు తీసుకొని ఉంటే ఎందుకు ఇప్పటివరకు సిబిఐ ఎంక్వయిరీకి ఆదేశించలేదని ప్రశ్నిస్తున్నారు ఇందులో జగన్ చేసిన తప్పులేదు కనకే కూటమి నేతలు మౌనంగా ఉన్నారని కౌంటర్ ఇస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

3 weeks ago