Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదంటూ మరో వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది.
ఇంకా కొంత భాగం షూటింగ్ ఉందని ఎడిటింగ్ వర్క్స్ అన్ని పూర్తి కావని అందుకే మరోసారి ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించారు. ఈ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఇందుకు సంబంధించిన విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇలా సినిమా షూటింగ్ లో భాగంగా ఓ పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నటువంటి ఫోటోలు ఈయన షేర్ చేస్తూ పుష్ప లాస్ట్ డే షూట్ అంటూ షేర్ చేశారు. పుష్ప యూనిట్ తో ఐదేళ్ల ప్రయాణం నేటితో ముగిసింది. ఇదొక అద్భుతమైన ప్రయాణం అంటూ ఈయన లవ్ సింబల్ తో ఈ ఫోటోని షేర్ చేయడమే కాకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు.
ఇక ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా పట్ల ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి. డిసెంబర్ 5వ తేదీ థియేటర్లలో వైల్డ్ ఫైర్ చూపించడానికి పుష్పరాజ్ సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా సందడి చేస్తుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…