Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు అదృశ్యం కావడం పట్ల స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిస్సింగ్ అయిన మహిళల గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బంది మిస్సింగ్ అయిన వారి ఆచూకిని కనిపెట్టి సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చారని తెలిపారు.
హోంశాఖ నేతృత్వంలో పోలీసులు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ పోలీసుల తీరుపై ప్రశంశల వర్షం కురిపించారు. ఈ తరుణంలోనే గత ప్రభుత్వంపై కూడా ఈయన విమర్శలు చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. గత ప్రభుత్వ హయామంలో సుమారు 30 వేల మంది మహిళలు అదృశ్యమైన ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా చేయలేదు అంటూ మరోసారి పవన్ ఆ 30 వేల మంది యువతుల గురించి ప్రస్తావన చేస్తూ ట్వీట్ చేశారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాలంటీర్లు మహిళలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్నారని తద్వారా 30 వేల మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారు అంటూ ఆరోపణలు చేయడంతో ఈ ఆరోపణలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది గతంలో మిస్సింగ్ అయిన 30వేల మందిని వెనక్కి తీసుకురావాలి అంటూ పవన్ కళ్యాణ్ ను డిమాండ్ చేశారు.
ఇలా అప్పుడు తప్పుడు వ్యాఖ్యలు చేశారని స్పష్టమైనప్పటికీ మరోసారి పవన్ కళ్యాణ్ ఆ 30 వేల మంది గురించి ప్రస్తావిస్తూ పోస్ట్ చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. మీరు అధికారంలో ఉన్నారు మరి తప్పిపోయిన ఆ 30 వేల మందిని వెనక్కి తీసుకురావచ్చు కదా అంటూ ప్రశ్నించడమే కాకుండా ముచ్చుమర్రి బాలిక మృతదేహం ఎక్కడ ?రోజు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాల సంగతి ఏంటి అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ పై వరుస ప్రశ్నలు వేస్తున్నారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…