Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు పవన్ కళ్యాణ్ .ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా రాజకీయాలలో ఉన్నత స్థాయిలో ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఇక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో టాలీవుడ్ పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ విజయం పై ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.
ఇలా పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇండస్ట్రీకి చెందిన ఓ బడా నిర్మాత పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చారని తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఈయన తన నిర్మాణ సంస్థలో ఏకంగా వంద సినిమాలను నిర్మించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు.
టీజీ విశ్వప్రసాద్..
ఇక పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా కూడా ఈయన నిర్మాణంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది తద్వారా పవన్ కళ్యాణ్ తో చాలా మంచి అనుబంధంగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విజయాన్ని ఈయన సెలెబ్రేట్ చేశారు జూన్ 23వ తేదీ రాత్రి హైదరాబాద్లోని ఓ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు దర్శక నిర్మాతలు కూడా హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…