ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే నదులు పొంగిపొర్లడంతో ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో కురిసిన అధిక వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహించాయి. ఈ నీటి వేగానికి పలు వంతెనలు కూడా కొట్టుకుపోయాయి . ఈ క్రమంలోనే స్థానికులు వర్ష ప్రభావానికి కొట్టుకుపోయిన వంతెనపై అమ్లావా నదిని దాటుతూ పెద్ద సాహసం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అధిక వర్షాల కారణంగా నదీ ప్రవాహానికి ఒకవైపు ఒరిగిపోయిన ఆ వంతెనపై స్థానిక ప్రజలు వంతెన దాటుతూ పెద్ద సాహసం చేస్తున్నారు. పొరపాటున కూడా కాలు జారితే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఈ వీడియోలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఒకరి చేయి ఒకరు పట్టుకొని వంతెన దాటుతూ కనిపిస్తారు.
https://twitter.com/ANI/status/1414819555361185792
అవతల ఒడ్డున ఉన్న ఒక వ్యక్తి వారికి చేయి సహాయం అందించగా ఇలా ఒకరికొకరు చేతుల సహాయంతో వంతెన దాటే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఓ మహిళ భయంతో మధ్యలో చేయి వదిలేయగా ఓ వ్యక్తి ఆ మహిళని ఎంతో చాకచక్యంగా వంతెన దాటించారు. ఈ విధంగా మిగతా ఇద్దరినీ కూడా మరో ఇద్దరు వ్యక్తులు కలిసి వంతెన దాటించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…