సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వినిపించే పేర్లలో కత్తి మహేష్ పేరు ఒకటి. ప్రముఖ ఫిలిం క్రిటిక్, నటుడిగా రాజకీయ విమర్శకుడిగా నిత్యం ఏదో ఒక వార్తల ద్వారా సోషల్ మీడియాలో ఉండే కత్తి మహేష్ మరణం తర్వాత కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. కత్తి మహేష్ జూన్ 26న నెల్లూరు దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అతడిని మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు.
అయితే ఆ సమయంలో కత్తి మహేష్ వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 17లక్షలు విడుదల చేయడం కూడా జరిగింది. అయితే కత్తి మహేష్ ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. అయన కోలుకున్తున్నారంటూ పలు వార్తలు వెలువడ్డాయి. కానీ అనుకోకుండా అయన జులై 10వ తేదీన ఉదయం మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ నేపధ్యంలో ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చిందని అందువల్ల అయన మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశారు.
ఈ నేపధ్యంలో జులై 12వ తేదీన చిత్తూరు జిల్లాలోని కత్తి మహేష్ స్వగ్రామంలో అతని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలోనే సోమవారం మహేష్ అంత్యక్రియలకు హాజరైన మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ మహేష్ వెనుక పలు అనుమానాలు ఉన్నాయని… దీనిపై వైద్యులు వివరణ ఇవ్వాలని తెలిపారు. మరోవైపు ప్రభుత్వం సిట్టింగ్ జడ్జెస్ తో కత్తి మహేష్ మరణంపై విచారణ జరిపించాలని కోరారు.
ఈ ప్రమాదంలో కారు కుడివైపు భాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ కి ఎటువంటి గాయాలు కాలేదని. కానీ ఎడమవైపు కూర్చున్న మహేష్ కు మాత్రం తీవ్ర గాయాలు కావడంపై సందేహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కత్తి మహేష్ కి చాలా మంది శత్రువులు ఉన్నారని అందువల్ల ఈ కేసుపై విచారణ జరిపించాలని కోరారు. అడలావుంటే కత్తి మహేష్ తండ్రి ఓబులేష్ కూడా తన కొడుకు మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తాజగా ఏపీ ప్రభుత్వం కత్తి మహేష్ మృతిపై విచారణ చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపద్యంలో కత్తి మహేష్ కారు డ్రైవర్ సురేష్ ని విచారణకు పిలిచినట్లు తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…