సాధారణంగా కార్ డ్రైవింగ్ చేయాలంటే ఎన్నో మెళకువలు నేర్చుకోవాల్సి ఉంటుంది. కేవలం డ్రైవింగ్ చేయడం మాత్రమే కాకుండా కారును పార్కింగ్ చేయడం కూడా నేర్చుకోవాలి. చిన్నచిన్న వీధులలో కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు కారుకు గీతలు పడకుండా, అదేవిధంగా రద్దీగా ఉన్న ప్రదేశాలలో కారును నడపడం, పార్కింగ్ చేయడంలో ఎన్నో మెలకువలు నేర్చుకోవాలి. లేదంటే ఈ వ్యక్తి పడిన కష్టాలు మీరు పడక తప్పదు.
యూకేలోని ఓ హాస్పిటల్‌లో పనిచేస్తున్న మేల్ నర్స్ ఆండ్రాయ్ డాల్కా బాల్కానీలో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో తన అపార్ట్మెంట్ ఎదురుగా ఓ వ్యక్తిని కారు పార్కింగ్ చేయడానికి పడుతున్న కష్టాలు ఆండ్రాయ్ దృష్టిలో పడ్డాయి. దీంతో ఆండ్రాయ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ సంఘటనను తన కెమెరాలో బంధించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ వ్యక్తి ఎలాంటి రద్దీ లేని ప్రదేశంలో తన కారును పార్కింగ్ చేయడం కోసం ఎంతో శ్రమపడ్డాడు. దాదాపు 8 నిమిషాల పాటు కారును ముందుకు తీసుకెళ్తూ, రివర్స్ చేస్తూ నానా ఇబ్బందులు పడ్డాడు. 8 నిమిషాల పాటు శ్రమించిన ఆ వ్యక్తి 9వ నిమిషానికి ఎంతో విజయవంతంగా తన కారును పార్క్ చేసి బయటకు వచ్చాడు.
ఈ విధంగా ఆ వ్యక్తి కారు పార్క్ చేయడానికి పడిన కష్టాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బహుశా అతనికి డ్రైవింగ్ చేయడం రాదేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…