2003వ సంవత్సరంలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గంగోత్రి.ఈ సినిమాలో అల్లు అర్జున్ మొట్టమొదటిసారిగా హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా ద్వారా అదితి అగర్వాల్ హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కురిపించింది. ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. చిన్నికృష్ణ కథను అందించారు. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో నటించే అద్భుతమైన అవకాశాన్ని ఒక స్టార్ డైరెక్టర్ వదులుకున్నాడు.
వెంకీ మామ, బలుపు, జై లవకుశ వంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు బాబీ గురించి అందరికీ తెలిసిందే. గంగోత్రి సినిమా షూటింగ్ సమయంలో బాబికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో బాబి చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు.
ఈ క్రమంలోనే రైటర్ చిన్ని కృష్ణ ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు తనను కలవమని బాబికి చెప్పారు. ఈ క్రమంలోనే గంగోత్రి సమయంలో తనకు సినిమాల్లో అవకాశం కల్పించమని బాబి చిన్ని కృష్ణని కోరడంతో వెంటనే రాఘవేంద్రరావు దగ్గరకు తీసుకు వెళ్లగా అందుకు రాఘవేంద్రరావు సరేనని ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే బాబీని నిక్కర్ వేసుకోవాలని అందుకు కొలతలు తీసుకోవాలని అసిస్టెంట్ డైరెక్టర్ కి తెలియజేశారు.
సినిమాలలో నిక్కర్ తొడిగితే గుంటూరులో తన పరువు పోతుందని భావించిన బాబి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. నిజానికి గంగోత్రి సినిమాలో బాబీని హీరో స్నేహితుని పాత్రలో నటించడం కోసం తీసుకోవాలని భావించినప్పటికీ బాబి ఈ సినిమాను వదులుకున్నారు.ఈ సినిమాలో నేను నటించనని చిన్ని కృష్ణతో చెప్పినప్పుడు చిన్ని కృష్ణ మరి ఏం చేస్తావని అడగగా కథలు రాస్తానని చెప్పాడట. ఇక ఈ సినిమాలో కొన్ని సీన్స్ రాయమని చెప్పగా ఎంతో అద్భుతంగా బాబి రాసి ఇవ్వడంతో అప్పటినుంచి రైటర్ గా ఆ తర్వాత దర్శకుడిగా మారి ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…