Samantha: ఇప్పటివరకు నేను చేసినవన్ని జనాలు మరిచిపోయారు…ఆసక్తికరవ్యాఖ్యలు చేసిన సమంత!
Samantha: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగ కొనసాగుతూ అక్కినేని ఇంటి కోడలిగా వెళ్లిన సమంత ఇండస్ట్రీలోకి వచ్చి పుష్కరకాలం పూర్తి అయినప్పటికీ ఏ మాత్రం తన క్రేజ్ తగ్గకుండా వరుస సినిమాలలో దూసుకుపోతున్నారు.అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్ళిన తర్వాత కథ ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం విడాకుల తర్వాత గ్లామరస్ పాత్రలకే ప్రాధాన్యత ఇస్తూ మరికొన్ని అవకాశాలను దక్కించుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సమంత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాలో ఐటమ్ సాంగు ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఈ పాట సమంతకు విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చిందని చెప్పాలి. ఈ పాట ఇంత మంచి గుర్తింపు తీసుకురావడం తనకు చాలా సంతోషంగా ఉందని గతంలో ఈ పాట పై సమంత స్పందించారు.
ఇదిలా ఉండగా తాజాగా సమంత మరోసారి ఐటమ్ సాంగ్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాజాగా జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు కార్యక్రమంలో సమంత పాల్గొంది. ఈ క్రమంలోనే సమంత మాట్లాడుతూ పుష్ప సినిమాలోని ఊ అంటావా మామ అనే పాట ఎలాంటి క్రేజ్ తెచ్చిపెట్టిందో మాటలలో చెప్పలేనని వెల్లడించారు.
నేను ఈ ఐటమ్ సాంగ్ లో నటిస్తున్నప్పుడు కేవలం తెలుగు భాషకు మాత్రమే పరిమితమవుతుందని నటించాను. కానీ ఈ పాట పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ పాటతో తనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడిందని ఈ పాట ద్వారా నేను ఇదివరకు నేను చేసిన సినిమాల గురించి జనాలు మర్చిపోయారని, ప్రస్తుతం ఈ పాట ద్వారా తనని గుర్తు పెట్టుకున్నారు అంటూ మరోసారి పుష్ప ఐటమ్ సాంగ్ పై ఈమె స్పందించారు
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…